Home /News /sports /

IPL 2021 DC VS MI LIVE UPDATES MUMBAI INDIANS WON THE TOSS AND OPTED BAT FIRST SRD

DC vs MI : ఇక సమరమే.. టాస్ ముంబై దే.. కీలక మార్పులు చేసిన రెండు జట్లు..

DC vs MI : వరుసగా హ్యాట్రిక్ టైటిల్ కొట్టాలని ఒకరు..ఈ సారైనా కప్పును ముద్దు పెట్టుకోవాలని మరొకరు. ఐపీఎల్ 14 వ సీజన్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రోహిత్ వర్సెస్ పంత్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

DC vs MI : వరుసగా హ్యాట్రిక్ టైటిల్ కొట్టాలని ఒకరు..ఈ సారైనా కప్పును ముద్దు పెట్టుకోవాలని మరొకరు. ఐపీఎల్ 14 వ సీజన్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రోహిత్ వర్సెస్ పంత్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

DC vs MI : వరుసగా హ్యాట్రిక్ టైటిల్ కొట్టాలని ఒకరు..ఈ సారైనా కప్పును ముద్దు పెట్టుకోవాలని మరొకరు. ఐపీఎల్ 14 వ సీజన్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రోహిత్ వర్సెస్ పంత్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ 2021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ అభిమానులకు కిక్ ఇస్తోంది. అప్పుడే సీజన్ లో 12 మ్యాచ్ లు ముగిశాయ్. మరోవైపు కాసేపట్లో మరో హోరాహోరీ పోరు జరగనుంది. చెన్నై చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్ తో తలపడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. గతేడాది ఫైనలిస్ట్ లు అయిన ఈ రెండు జట్లు ఎప్పుడూ హాట్ ఫేవరేట్లే. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కీలక మార్పులు చేశాయ్. ఆడమ్ మిల్నే స్థానంలో స్పిన్నర్ జయంత్ యాదవ్ ని ముంబై తీసుకుంది. అటు ఢిల్లీ కూడా రెండు మార్పులు చేసింది. హెట్ మేయర్, అమిత్ మిశ్రాలను జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌ సమవుజ్జీల పోరుగా జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టే స్థాయిలో ఉంది ఢిల్లీ కేపిటల్స్. బ్యాటింగ్.. బౌలంగ్‌లో ఏ మాత్రం తీసిపోని విధంగా తయారైంది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్‌లతో బలంగా ఉందా జట్టు. క్రిస్ వోక్స్, కగిసొ రబడా, రవిచంద్రన్ అశ్విన్, అవేష్ ఖాన్ వంటి బౌలర్లు ఎలాంటి బ్యాట్స్‌మెన్లను కూడా కట్టి పడేయగలరు.

  సీజన్ ప్రారంభంలో తడబడ్డా.. టోర్నమెంట్ సాగే కొద్దీ రాటుదేలే సత్తా రోహిత్ శర్మ టీమ్‌కు ఉంది. తొలి మ్యాచ్‌లో ఓటమిని చవి చూసింది. మిగిలిన రెండింట్లోనూ విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. భారీ తేడాతో నెగ్గి, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటే టాప్ ప్లేస్‌ను అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ ప్లేస్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆధీనంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ముంబై ఇండియన్స్ టాప్ ఫైవ్‌లో నిలవలేకపోవచ్చు. నాలుగు ఓటములు, నాలుగు పాయింట్లతో అయిదు లేక ఆరో స్థానానికి దిగజారే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కీరన్ పొల్లార్డ్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాట్స్‌మెన్లు, బుమ్రా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్లు, పాండ్యా బ్రదర్స్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్న జట్టు అంత తేలిగ్గా ఓడిపోయేది కాదు.

  ఇక, హెడ్ టు హెడ్ రికార్డుల్లో ముంబై దే పై చేయి. ఇరు జట్ల మధ్య 28 మ్యాచ్ లు జరగగా.. 16 గేమ్స్ లో ముంబై ఇండియన్స్ నెగ్గగా.. మిగతా 12 మ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. గతేడాది సీజన్ లో ముంబై చేతిలో ఫైనల్ లో ఓడి కప్ ను గెలిచే అవకాశాన్ని సరిచేసుకుంది.

  తుది జట్లు : 

  Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Steven Smith, Rishabh Pant(w/c), Marcus Stoinis, Shimron Hetmyer, Lalit Yadav, Ravichandran Ashwin, Kagiso Rabada, Amit Mishra, Avesh Khan

  Mumbai Indians (Playing XI): Quinton de Kock(w), Rohit Sharma(c), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Rahul Chahar, Jayant Yadav, Jasprit Bumrah, Trent Boult
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Delhi Capitals, IPL 2021, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు