Home /News /sports /

IPL 2021 DC VS MI LIVE UPDATES DELHI CAPITALS WON BY 6 WICKETS SRD

DC vs MI : చెపాక్ లో ఢిల్లీదే విక్టరీ.. మరోసారి రాణించిన గబ్బర్..

DC vs MI : ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకుపోతోంది. మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్ లో  సెకండ్ స్థానానికి ఎగబాకింది. పటిష్ట ముంబైని చిత్తు చేసింది రిషభ్ పంత్ సేన.

DC vs MI : ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకుపోతోంది. మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్ లో సెకండ్ స్థానానికి ఎగబాకింది. పటిష్ట ముంబైని చిత్తు చేసింది రిషభ్ పంత్ సేన.

DC vs MI : ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకుపోతోంది. మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్ లో సెకండ్ స్థానానికి ఎగబాకింది. పటిష్ట ముంబైని చిత్తు చేసింది రిషభ్ పంత్ సేన.

    చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ కొట్టింది. ఆరు వికెట్ల తేడాతో ముంబై ను చిత్తు చేసింది. 19.1 బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. శిఖర్ 45 పరుగులు, స్మిత్ 33 పరుగులతో రాణించారు. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ఆదిలోనే షాక్ తగిలింది. జయంత్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి పృథ్వీ షా(7) కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ధావన్, స్మిత్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును కదిలించారు. 29 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి టచ్ లో కన్పించిన స్మిత్ ను పొలార్డ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత శిఖర్ తో కలిసిన లలిత్ యాదవ్.. వేగంగా పరుగులు చేయలేకపోయాడు. కానీ, శిఖర్ ధావన్ రాహుల్ చాహర్ వేసిన 15 ఓవర్ లో వరుస బంతుల్లో 6, 4 కొట్టాడు. కానీ, అదే ఓవర్ లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖర్లో బుమ్రా బౌలింగ్ లో రిషభ్ పంత్ భారీ షాట్ కు యత్నించి ఔటవ్వడంతో ఢిల్లీ శిబిరంలో ఆందోళన కన్పించింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన హెట్ మేయర్, లలిత్ యాదవ్ తో కలిసి టార్గెట్ ను పూర్తి చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, రాహుల్ చాహర్, పొలార్డ్, జయంత్ యాదవ్ తలా ఓ వికెట్ తీశారు.

    అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పటిష్ట ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసి.. ఢిల్లీ ముందు 138 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్ పడగొట్టి ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. పేసర్ అవేశ్ ఖాన్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (44, 30 బంతుల్లో 3x4, 3x 6) చెలరేగగా.. ఇషాన్ కిషన్ (26, 28 బంతుల్లో 1x4, 1x 6), జయంత్ యాదవ్ (23, 22 బంతుల్లో 1x4) ఆదుకున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (24) రెండంకెల స్కోరు చేశాడు. మిశ్రా దెబ్బకి మెరుపులు లేకుండానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. ఒక దశలో రోహిత్ బ్యాటింగ్ తో ముంబై భారీ స్కోరు సాధించేలా కన్పించింది. అయితే, తన లెగ్ స్పిన్ మ్యాజిక్ తో ముంబై ను బెంబేలెత్తించాడు వెటరన్ స్పిన్నర్ మిశ్రా.

    ఇక, రేపు డబుల్ ధమాకా జరగనుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ లో ఇంతవరుకు బోణీ కొట్టని.. ఆరెంజ్ ఆర్మీ రేపటి మ్యాచ్ లో రాణించి పాయింట్స్ ఖాతా తెరవాలని భావిస్తోంది. ఇక, రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Delhi Capitals, IPL 2021, Mumbai Indians, Rohit sharma, Shikhar Dhawan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు