Home /News /sports /

IPL 2021 : దినేశ్ కార్తీక్ , గబ్బర్ ల మధ్య రచ్చ ఏంటి..? కార్తీక్ యాక్షన్ కు ధావన్ రియాక్షన్..వైరల్ వీడియా

IPL 2021 : దినేశ్ కార్తీక్ , గబ్బర్ ల మధ్య రచ్చ ఏంటి..? కార్తీక్ యాక్షన్ కు ధావన్ రియాక్షన్..వైరల్ వీడియా

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IPL 2021 : నిన్న రాత్రి మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మధ్య చోటు చేసుకున్న ఈ సీన్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందర్నీ అలరిస్తోంది. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు టీమ్స్ ఈ సీజన్ లో దూసుకెళుతున్నాయ్. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో కుర్చీలాట మొదలైంది. టాప్ ప్లేస్ కోసం ఈ మూడు జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయ్. ఇక, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైడరైడర్స్ ను చిత్తు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). పృథ్వీషా సునామీ ఇన్నింగ్స్ కు కోల్ కతా బౌలర్లు చేతులేత్తేశారు. ఇక, ఏడు మ్యాచుల్లో అయిదింట్లో గెలుపొందిన రిషభ్ పంత్ టీమ్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా ఈ సీజన్‌ను ఆరంభించిన ఢిల్లీ కేపిటల్స్.. దానికి తగినట్టుగా ఆటతీరును కనపరుస్తోంది. బలమైన బ్యాటింగ్ లైనప్.. సూపర్ బౌలింగ్ వనరులతో ప్లేఆఫ్ వైపు దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ సత్తా ఏంటో అందరికీ తెలిసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్.. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే, నిన్న రాత్రి మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మధ్య చోటు చేసుకున్న ఈ సీన్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌‌ను షాట్ ఆడటానికి ప్రయత్నించిన గబ్బర్ దాన్ని మిస్ అయ్యాడు. బంతి కాస్తా దినేష్ కార్తీక్ చేతుల్లో వాలింది. వెంటనే అతను బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. అతను క్రీజ్‌ నుంచి కదలకపోవడం.. దినేష్ కార్తీక్‌ను అసహనానికి గురి చేసినట్టయింది. శిఖర్ ధావన్‌పై ఫైర్ అయ్యాడు. ఎ




    డమ చేతిని గాల్లోకి విసురుతూ ఆవేశంగా ఏదో చెప్పాడు. దీనితో గబ్బర్ మోకాళ్లపై కూలబడ్డాడు. వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఈ హైఓల్టేజ్ సీన్‌ను చూసిన ఫీల్డ్ అంపైర్ వారిని వారించడానికి పరుగెత్తుకుని రావడం కనిపించింది. ఆ వెంటనే దినేష్ కార్తీక్.. వికెట్ల వెనక్కి చేరడం.. వరుణ్ చక్రవర్తి నెక్స్ట్ బాల్‌ను ఎదుర్కొనడానికి గబ్బర్ సింగ్ బిజీ కావడంతో ఈ సీన్ అక్కడితె కట్ అయింది. అయితే, ఈ వీడియో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ సీన్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Delhi Capitals, Dinesh Karthik, IPL 2021, Kolkata Knight Riders, Shikhar Dhawan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు