155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడు కనబరుస్తుంది. ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా మరోసారి తన బ్యాట్ పవర్ రుచి చూపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే తన ఉద్దేశాన్ని ఘనంగా చాటాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో పృథ్వీ షా వైడ్ సహా మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన పృథ్వీ షా తాను ఎంత ప్రమాదకర ఆటగాడో చెప్పకనే చెప్పాడు. ఎటు బంతి వేసినా సరే... అలవోకగా బౌండరీ లైన్ కు తరలించాడు. షా దూకుడుతో పవర్ ప్లే ముగిసే సమయానికి 67 పరుగులు చేసింది. ఈ రేర్ ఫీట్ తో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు పృథ్వీషా. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్ లో ఆరు బంతులకు ఆరు బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. మరోవైపు టార్గెట్ వైపు దూకుడుగా దూసుకెళుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు పృథ్వీషా దూకుడుకి.. శిఖర్ ధావన్ అండగా నిలుస్తున్నాడు. మరోవైపు ఈ ఐపీఎల్ ఫాసెస్ట్ ఫిఫ్టీ మార్క్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు పృథ్వీ. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు ఈ యంగ్ తరంగ్.
అంతకు ముందు, బర్త్‌డే బాయ్ ఆండ్రీ రస్సెల్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 నాటౌట్) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ 155 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. రస్సెల్‌కు ముందు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. మరోసారి కేకేఆర్ టాప్ బ్యాట్స్‌మెన్ తడబడటంతో ఓదశలో కనీసం 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ రస్సెల్ ధాటికి చివరి మూడు ఓవర్లలో 42 రన్స్ రావడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL 2021, Kolkata Knight Riders, Prithvi shaw