హోమ్ /వార్తలు /sports /

DC vs KKR : ఆఖర్లో ఆండ్రీ రస్సెల్ జిగేల్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

DC vs KKR : ఆఖర్లో ఆండ్రీ రస్సెల్ జిగేల్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

DC vs KKR : వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ కి గత మ్యాచ్ లో బ్రేక్ పడింది. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న కోల్ కతా గత మ్యాచ్ లో గెలిచి ఫామ్ లోకి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్ లో రస్సెల్ మెరుపులతో కోల్ కతా ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.

ఇంకా చదవండి ...

    అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా మంచి టోటల్ సెట్ చేసింది. ఫస్ట్ లో బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడినా.. ఆఖర్లో విండీస్ వీరుడు రస్సెల్ మెరుపులు మెరిపించడంతో కోల్ కతా ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రస్సెల్ 27 బంతుల్లో 45 పరుగులు ( 2 ఫోర్లు, 4 సికర్లు) తో మెరుపులు మెరిపించాడు. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆదిలోనే షాక్ తగలింది. 15 పరుగులు చేసిన నితీష్‌ రానా అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో పంత్‌ మెరుపు స్టంపింగ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, శుభ్ మన్ గిల్ నెమ్మదిగా ఆచి తూచి ఆడారు. గిల్ అడపా దడపా బౌండరీలు బాదాడు. అయితే, రాహుల్‌ త్రిపాఠి(19) రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. స్టొయినిస్ బౌలింగ్ లో త్రిపాఠి..లలిత్ యాదవ్ చేతికి క్యాచ్ ఔటయ్యాడు. అయితే, కాసేపటికే..కోల్ కతాకు డబుల్ ఝలక్ తగిలింది. ఢిల్లీ బౌలర్‌ లలిత్‌ యాదవ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో రెండో బంతికి మోర్గాన్‌ను డకౌట్‌ చేసిన లలిత్‌ నాలుగో బంతికి నరైన్‌(0) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 75 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న గిల్ కూడా కాసేపటికే పెవిలియన్ బాట పట్టాడు.

    38 బంతుల్లో 43 పరుగులు చేసిన గిల్ ను అవేశ్ ఖాన్ బోల్తా కొట్టించాడు. స్టీవ్ స్మిత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు గిల్. 10 బంతుల్లో 14 పరుగులు చేసి ఊపు మీద కన్పించిన కార్తీక్ ను అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. ఆఖర్లో రస్సెల్ మెరుపులు మెరిపించడంతో కోల్ కతా ఈ మాత్రం స్కోరైనా సాధించింది.

    ఐపీఎల్‌లో ఢిల్లీ, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. కోల్‌కతాదే పైచేయి. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

    First published:

    ఉత్తమ కథలు