Home /News /sports /

IPL 2021 DC VS KKR LIVE UPDATES DELHI CAITALS WON THE TOSS AND OPT FIELD FIRST SRD

DC vs KKR : టాస్ గెలిచిన ఢిల్లీ... గాయంతో ఢిల్లీ జట్టులో కీలక బౌలర్ దూరం..

DC vs KKR : టాస్ గెలిచిన ఢిల్లీ... గాయంతో ఢిల్లీ జట్టులో కీలక బౌలర్ దూరం..

DC vs KKR : టాస్ గెలిచిన ఢిల్లీ... గాయంతో ఢిల్లీ జట్టులో కీలక బౌలర్ దూరం..

DC vs KKR : వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ కి గత మ్యాచ్ లో బ్రేక్ పడింది. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న కోల్ కతా గత మ్యాచ్ లో గెలిచి ఫామ్ లోకి వచ్చింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య ఆసక్తిపోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ 2021 సీజన్ లో మరికాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ.. గత మ్యాచులో బెంగళూరుపై ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. ఇక, కోల్‌కతా చివరి మ్యాచులో పంజాబ్ జట్టుపై గెలిచి ఫామ్ లోకి వచ్చింది. నాలుగు ఓటముల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూసిన కోల్‌కతా అదే జోరుని కొనసాగించాలని చూస్తుండగా.. మరో విజయంపై ఢిల్లీ కన్నేసింది. ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా ధాటిగా ఆడుతూ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. పవర్ ప్లే‌లో బౌండరీల వర్షం కురిపిస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా షా మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఒక్కోసారి తక్కువ స్కోర్లకే ఔటవుతున్నారు. స్టీవ్‌ స్మిత్ నెమ్మదిగా ఆడుతూ జట్టుకు భారంగా మారాడు. కెప్టెన్ రిషబ్ పంత్, హిట్టర్ షిమ్రాన్ హిట్‌మెయర్ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలు చేసి మళ్లీ ఫామ్ అందుకున్నారు. హిట్‌మెయర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. అయితే ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఫామ్ ఢిల్లీని ఆందోళనకు గురిచేస్తోంది. బౌలింగ్‌లో కూడా ఢిల్లీ పటిష్టంగానే ఉంది. కగిసో రబాడ, అవేష్ ఖాన్‌కి జోడీగా ఇషాంత్ శర్మ రావడంతో.. పేస్ బలం మరింత పెరిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నా.. చివరలో కాస్త పరుగులు ఇస్తున్నారు. అమిత్ మిశ్రాకి గాయమవ్వడంతో అతని ప్లేస్ లో లలిత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.

  మరోవైపు కోల్‌కతాలో ఓపెనర్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ నిరాశపరుస్తున్నారు. ఇద్దరిలో ఒకరు త్వరగానే పెవిలియన్‌కి చేరిపోతున్నారు. దాంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడుతోంది. రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడుతుండగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫామ్ అందుకోవడం సంతోషకరమైన విషయం. దినేశ్ కార్తీక్ ఫినిషర్ రోల్‌ని పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆండ్రీ రసెల్ మెరుపులు ఒక మ్యాచుకు పరిమితం అయ్యాయి. బౌలింగ్‌లో శివమ్ మావి, పాట్ కమిన్స్‌ అదరగొడుతున్నారు. ప్రసీద్ క్రిష్ణ మాత్రం భారీగా గత మ్యాచ్ లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఆకట్టుకున్నారు.

  ఐపీఎల్‌లో ఢిల్లీ, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. కోల్‌కతాదే పైచేయి. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

  తుదిజట్లు :
  Kolkata Knight Riders (Playing XI): Shubman Gill, Nitish Rana, Rahul Tripathi, Sunil Narine, Eoin Morgan(c), Andre Russell, Dinesh Karthik(w), Pat Cummins, Shivam Mavi, Prasidh Krishna, Varun Chakravarthy

  Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Steven Smith, Rishabh Pant(w/c), Marcus Stoinis, Shimron Hetmyer, Axar Patel, Lalit Yadav, Kagiso Rabada, Ishant Sharma, Avesh Khan
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Delhi Capitals, IPL 2021, Kolkata Knight Riders, Rishabh Pant

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు