Home /News /sports /

IPL 2021 : నన్నే టార్గెట్ చేస్తావా..పృథ్వీషా మెడ పట్టుకున్న శివమ్ మావీ..వైరల్ వీడియా

IPL 2021 : నన్నే టార్గెట్ చేస్తావా..పృథ్వీషా మెడ పట్టుకున్న శివమ్ మావీ..వైరల్ వీడియా

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IPL 2021 : ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఆరు బంతులకు ఆరు బౌండరీలను బాదేశాడు. ఒకే ఓవర్‌లో ఆరు బౌండరీలను కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్ అతనే. ఇది వరకు భారత్‌కే చెందిన అజింక్య రహానే ఈ ఫీట్ సాధించాడు. నాలుగు ఓవర్లను వేయాల్సిన శివమ్.. ఆ ఒక్క ఓవర్‌ తరువాత మరోసారి బౌలింగ్ చేయడానికి ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయాడు.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు టీమ్స్ ఈ సీజన్ లో దూసుకెళుతున్నాయ్. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో కుర్చీలాట మొదలైంది. టాప్ ప్లేస్ కోసం ఈ మూడు జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయ్. ఇక, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైడరైడర్స్ ను చిత్తు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). పృథ్వీషా సునామీ ఇన్నింగ్స్ కు కోల్ కతా బౌలర్లు చేతులేత్తేశారు. ఇక, ఏడు మ్యాచుల్లో అయిదింట్లో గెలుపొందిన రిషభ్ పంత్ టీమ్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా ఈ సీజన్‌ను ఆరంభించిన ఢిల్లీ కేపిటల్స్.. దానికి తగినట్టుగా ఆటతీరును కనపరుస్తోంది. బలమైన బ్యాటింగ్ లైనప్.. సూపర్ బౌలింగ్ వనరులతో ప్లేఆఫ్ వైపు దూసుకెళ్తోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్..బౌలింగ్, బ్యాటింగ్ సత్తా ఏమిటనేది మరోసారి స్పష్టమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ జట్టును 154 పరుగులకే పరిమితం చేసింది. డెత్ ఓవర్లలో ఆండ్రీ రస్సెల్ చెలరేగిపోయి ఆడకపోయి ఉంటే.. ఆ మాత్రం పరుగులు కూడా వచ్చేవి కావు. ఆండ్రీ రస్సెల్.. 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు.

  ఇక, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్..తొలి ఓవర్ నుంచి టాప్ స్పీడ్‌లో దూసుకెళ్లింది. శివమ్ మావి వేసిన తొలి ఓవర్‌లోనే ఒక వైడ్ సహా 25 పరుగులొచ్చాయి. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా ఆరు బంతులకు ఆరు బౌండరీలను బాదేశాడు. ఒకే ఓవర్‌లో ఆరు బౌండరీలను కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్ అతనే. ఇదివరకు భారత్‌కే చెందిన అజింక్య రహానే ఈ ఫీట్ సాధించాడు. నాలుగు ఓవర్లను వేయాల్సిన శివమ్.. ఆ ఒక్క ఓవర్‌ తరువాత మరోసారి బౌలింగ్ చేయడానికి ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయాడు. ఒక ఓవర్‌లో 25 పరుగులను సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడతను. ఇక, మ్యాచ్ ముగిసిన తర్వాత పృథ్వీషా పై చిరు కోపాన్ని ప్రదర్శించాడు శివమ్ మావీ. పృథ్వీషా మెడ పట్టుకుని ఫన్నీగా స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు.


  నిజానికి పృథ్వీ షా, శివమ్ మావి టీమ్ మేట్స్. వారిద్దరూ టీమిండియా అండర్ 19 జట్టుకు ఆడారు. 2018 అండర్ 19 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టులో వారిద్దరూ సభ్యులు. ఒకరి బ్యాటింగ్ టెక్నిక్ మరొకరికి, ఒకరి బౌలింగ్ లొసుగులు మరొకరికి బాగా తెలుసు. శివమ్ బౌలింగ్‌లో చెలరేగిపోయి ఆడటానికి కారణాన్ని వివరించాడు పృథ్వీ షా. తామిద్దరం నాలుగైదుళ్లుగా కలిసి ఆడుతున్నామని, అతని బౌలింగ్ టెక్నిక్‌పై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పాడు. మొత్తానికి ఐపీఎల్ లో మిత్రులే ప్రత్యర్థులుగా మారడం ఫ్యాన్స్ కు బోలెడంత కిక్ ఇస్తోంది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Delhi Capitals, IPL 2021, Kolkata Knight Riders, Prithvi shaw

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు