IPL 2021 - DC vs CSK: ఎడారిలో కొదమసింహాల వేట.. రెండు జట్లలో మార్పులు.. తుది జట్లు ఇవే..!

IPL 2021 - DC vs CSK

IPL 2021 - DC vs CSK: ఓ వైపు సీనియర్లు అనుభవం.. మరో వైపు కుర్రాళ్ల దూకుడు.. చివరికి ఎవరిది పై చేయి అవుతుందో. సూపర్ సండే రోజున ఫ్యాన్స్ కు అదిరిపోయే కిక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు గురు శిష్యులు.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ చివరి దశకు రెడీ అయింది. క్రికెట్ లవర్స్ కు సూపర్ కిక్ ఇవ్వడానికి సూపర్ సండే సై అంటోంది. ఫైనల్ వేటలో ముందు అడుగు వేయడానికి ఉవ్విల్లూరుతున్నాయ్ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ (DC vs CSK Match Updates). ఆదివారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఓవైపు అనుభవంతో కూడిన 'డాడీస్ ఆర్మీ'.. మరోవైపు దూకుడు మీదున్న కుర్రాళ్లు.. అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. ఆ రెండు మ్యాచ్‌లలో ఢిల్లీనే గెలుపొందింది. గురు శిష్యులైన ఎంఎస్ ధోనీ (MS Dhoni), రిషబ్ పంత్ (Rishabh Pant) మధ్య పోటీలో ఇప్పటి వరకు పంత్‌దే పై చేయి అయ్యింది. కానీ, క్వాలిఫైయిర్స్ లో ధోనీ సేన రికార్డు పంత్ సేనను కలవరపెడుతోంది. ప్రతికూల పరిస్థితులను దాటి విజయాలు సాధించడం ఆ జట్టుకు అలవాటే. కాగా, ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన టీమ్.. ఆర్‌సీబీ-కోల్‌కతా మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో క్వాలిఫైయిర్ - 2లో పోటీ పడుతుంది.

  ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి ఐపీఎల్‌ టైటిల్‌ కోసం పట్టుదలతో ఉన్న ఢిల్లీ తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయింది. తొలి ఐపీఎల్‌ టైటిల్‌ కోసం పట్టుదలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ గత కొన్నేళ్లుగా ఎంతో మెరుగైంది. కోచ్‌ రికీ పాంటింగ్‌ ప్రణాళికలు గత రెండు సీజన్లుగా మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. నిలకడైన బ్యాటింగ్, కట్టడి చేసే బౌలింగ్‌ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

  వరుసగా మూడో సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరింది. 2019లో రెండో క్వాలిఫయర్‌లో ఓడిన ఆ జట్టు.. గతేడాది ఫైనల్లో పరాజయం పాలైంది. గత రెండు సార్లు టైటిల్‌కు చేరువై దూరమైన ఆ జట్టు.. ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(544), పృథ్వీ షా(401) జట్టుకు గొప్ప ఆరంభాలనిస్తున్నారు.

  ఈ ఇద్దరూ ఇదే జోరు కొనసాగిస్తే.. ఢిల్లీ బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇక ఆ తర్వాత పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హెట్‌మయర్‌, స్టోయినిస్, అక్షర్‌ పటే‌ల్‌తో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఢిల్లీ ఆడింది. కానీ చెన్నైతో మ్యాచ్‌కు స్టోయినిస్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నట్లు పంత్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలో స్టోయినిస్‌ జట్టులోకి వస్తే బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా జట్టుకు మేలవుతుంది.

  అత్యధిక వికెట్ల వీరుల లిస్ట్ లోలో రెండో స్థానంలో ఉన్న అవేశ్‌ ఖాన్‌ (22)తో పాటు సఫారీ పేస్‌ ద్వయం రబడా, నోర్జ్‌తో కూడిన పేస్‌ దళం ప్రత్యర్థి బ్యాటర్లకు పరీక్షగా నిలుస్తోంది.పవర్‌ప్లేలో, మధ్య ఓవర్లలో అక్షర్‌ (15) తన స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఎలాంటి బంతి వేయాలనే పూర్తి అవగాహన, అనుభవం ఉన్న సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌తో ప్రత్యర్థులకు ముప్పు తప్పదు.

  ఇది కూడా చదవండి : ధోనీ- సాక్షిల ప్రేమ పెళ్లికి కారణమెవరో తెలుసా..? ఆ వ్యక్తి కూడా టీమిండియా క్రికెటరే..!

  ఆడిన అన్ని సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌ చేరిన ధోనీసేన.. గతేడాది మాత్రం పేలవ ప్రదర్శనతో తొలిసారి కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ జట్టుపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. కానీ ఈ సీజన్‌లో సరికొత్తగా అడుగుపెట్టిన చెన్నై.. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అదరగొడుతోంది. చెన్నై బ్యాటింగ్‌ బలంతో టోర్నీలో ముందడుగేసింది. సింహ భాగం మ్యాచ్‌ల్లో జట్టు భారమంతా రుతురాజ్‌ గైక్వాడ్, డుప్లెసిస్‌ మోశారు. అడపాదడపా రాయుడు, మొయిన్‌ అలీ మెరిపిస్తున్నాడు.

  అనుభవజ్ఞుడైన సురేశ్‌ రైనా వైఫల్యం వల్ల రాబిన్‌ ఉతప్పకు అవకాశమిచ్చారు. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో మళ్లీ రైనాను తుది జట్టులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఈ మెగా ఫైట్ లో ధోనీ తన బ్యాట్ కు పని చెప్పాల్సి ఉంది. శార్దుల్‌ ఠాకూర్, హాజల్‌వుడ్‌లు ఆరంభ ఓవర్లలో కట్టడి చేయగలిగితే స్పిన్‌తో జడేజా మాయచేసేందుకు అవకాశముంటుంది. ఢిల్లీ ఎంత బలంగా ఉన్నా... మాజీ చాంపియన్‌ అనుభవం పంత్ సేనలో టెన్షన్ పుట్టిస్తోంది.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  ఇక, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద బెటర్ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ కే ఉంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో చెన్నై 15 సార్లు నెగ్గితే.. ఢిల్లీ క్యాపిటల్స్ 10 సార్లు విజయకేతనం ఎగురవేసింది. ఐపీఎల్ చరిత్రలో 12 సీజన్లు ఆడిన చెన్నై జట్టు 11 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

  పిచ్ రిపోర్ట్ :
  దుబాయ్‌ పిచ్‌ స్లోగా బిహేవ్ చేస్తోంది. ఇక్కడ జరిగిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క ఇన్నింగ్స్‌లోనూ స్కోరు 170 దాటలేదు. స్లో బౌలర్లు పండుగ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది సార్లు రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.

  తుది జట్లు (అంచనా)

  ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్, హెట్‌మైర్, రిపాల్‌ పటేల్/ స్టొయినిస్ , అక్షర్‌ పటేల్, రవిచంద్రన్‌ అశ్విన్, కగిసో రబడ, నోర్జే, అవేశ్‌ ఖాన్‌.

  చెన్నై సూపర్‌కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్ప/సురేశ్‌ రైనా, ధోనీ(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్‌ ఠాకూర్, దీపక్‌ చహర్, హాజెల్‌వుడ్‌.
  Published by:Sridhar Reddy
  First published: