Home /News /sports /

IPL 2021 CSK VS SRH LIVE UPDATES SUNRISERS HYDERABAD WON THE TOSS AND OPT TO BAT FIRST SRD

CSK vs SRH : టాస్ గెలిచిన సన్ రైజర్స్ .. కీలక మార్పులతో బరిలోకి రెండు జట్లు..

CSK vs SRH : టాస్ గెలిచిన సన్ రైజర్స్ .. కీలక మార్పులతో బరిలోకి రెండు జట్లు..

CSK vs SRH : టాస్ గెలిచిన సన్ రైజర్స్ .. కీలక మార్పులతో బరిలోకి రెండు జట్లు..

CSK vs SRH : ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నెం.2 స్థానంలో చెన్నై కొనసాగుతుండగా.. హైదరబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌లకిగానూ ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. పటిష్ట చెన్నైని ఓడించాలంటే.. సన్‌రైజర్స్ కష్టపడాల్సిందే.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ 2021 సీజన్ లో మరికాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన 'సూపర్‌ ఓవర్‌' మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కఠిన పోరుకు సిద్ధమైంది. మూడుసార్లు చాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఢిల్లీ వేదికగా ఈ పోరు జరగనుంది. ఇక, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నెం.2 స్థానంలో చెన్నై కొనసాగుతుండగా.. హైదరబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌లకిగానూ ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. పటిష్ట చెన్నైని ఓడించాలంటే.. సన్‌రైజర్స్ కష్టపడాల్సిందే. అయితే ఐపీఎల్ 2021 ఆరంభం నుంచి హైదరాబాద్‌ను వేధిస్తోన్న ప్రధాన సమస్య మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌. ఈ సమస్యతోనే గెలవాల్సిన మ్యాచ్ ల్లో చేతులేత్తేసింది హైదరాబాద్. టాప్ ఆర్డర్ బాగున్నా.. మిడిలార్డర్‌లో ఒక్క సరైన బ్యాట్స్‌మన్‌ లేక ఇబ్బందులు పడుతోంది. ఎప్పటిలానే ఈ మ్యాచులో కూడా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో.. కేన్ విలియమ్సన్‌లను సన్‌రైజర్స్‌ నమ్ముకుంటోంది.

  ఈ సీజన్లో వార్నర్ మోస్తరు ప్రదర్శనకే పరిమితం అవుతున్నాడు. ఓపెనర్‌గా వార్నర్‌ పరుగులు సాధిస్తున్నా ధాటిగా ఆడలేకపోతున్నాడు. తన మార్క్ ఆట ఆడాల్సి ఉంది. ఇక ఢిల్లీపై సూపర్‌ ఓవర్‌లో వార్నర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటివి సరిదిద్దుకోవాల్సి ఉంది. బెయిర్‌స్టో, విలియమ్సన్‌ ఫామ్‌లో ఉండటం హైదరాబాద్‌కు ఊరటనిచ్చే అంశం. మిడిల్‌లో సరైన ఆటగాళ్లు లేక ఇప్పటికే నాలుగు ఓటములు చవిచూసింది. విజయ్ శంకర్, కేదార్‌ జాదవ్, విరాట్ సింగ్, అభిషేక్‌ శర్మలు పూర్తిగా విఫలమయ్యారు. నిలకడలేమితో జట్టుకు భారంగా మారారు. గత మ్యాచులో ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, అభిషేక్ శర్మ ధారాళంగా పరుగులు ఇచ్చారు. దీంతో సన్‌రైజర్స్‌ స్టార్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఫిట్‌నెస్‌ కారణంగా భువీ ఈ మ్యాచుకు దూరం కానున్నాడు. రషీద్ ఖాన్‌కు తోడు ఖలీల్, సిద్దార్థ్ మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.

  ఇక, మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయంపై కన్నేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్‌ దంచి కొడుతున్నారు. ఆపై మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఫామ్ అందుకున్నాడు. అంబటి రాయుడు ధాటిగా ఆడుతున్నా.. భారీ స్కోర్లు చేయడం లేదు. ఇక కెప్టెన్ ఎంఎస్ ధోనీ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. మ్యాచ్‌ను ఫినిష్‌ చేసేందుకు రవీంద్ర జడేజా ఉండనే ఉన్నాడు. లోయర్ ఆర్డర్‌లో సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్ తలో చేయి వేయగలరు. బౌలింగ్ విభాగంలో దీపక్ చహర్, కరన్, శార్దూల్, జడేజా మెరుస్తున్నారు. వీరికి ఇమ్రాన్ తాహిర్ కూడా జతయ్యాడు. అవసరం అయితే బ్రావో కూడా బౌలింగ్ చేస్తాడు. మొత్తానికి చెన్నై అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇక, హెడ్ టు హెడ్ రికార్డుల్లో చెన్నైదే పై చేయిగా కన్పిస్తోంది. ఇరు జట్ల మధ్య 14 మ్యాచ్ లు జరగగా.. చెన్నై 10 మ్యాచ్ ల్లో నెగ్గగా.. హైదరాబాద్ 4 గేమ్స్ ల్లో గెలిచింది.

  తుది జట్లు : 

  Chennai Super Kings (Playing XI): Ruturaj Gaikwad, Faf du Plessis, Moeen Ali, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Ravindra Jadeja, Sam Curran, Shardul Thakur, Lungi Ngidi, Deepak Chahar

  Sunrisers Hyderabad (Playing XI): David Warner(c), Jonny Bairstow(w), Kane Williamson, Manish Pandey, Kedar Jadhav, Vijay Shankar, Rashid Khan, Jagadeesha Suchith, Sandeep Sharma, Khaleel Ahmed, Siddarth Kaul
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai Super Kings, David Warner, IPL 2021, Ms dhoni, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు