Home /News /sports /

CSK vs SRH : హాఫ్ సెంచరీలతో మెరిసిన వార్నర్, మనీశ్ పాండే...ధోనీసేన టార్గెట్ ఎంతంటే..

CSK vs SRH : హాఫ్ సెంచరీలతో మెరిసిన వార్నర్, మనీశ్ పాండే...ధోనీసేన టార్గెట్ ఎంతంటే..

CSK vs SRH : హాఫ్ సెంచరీలతో మెరిసిన వార్నర్, మనీశ్ పాండే...ధోనీసేన టార్గెట్ ఎంతంటే..

CSK vs SRH : హాఫ్ సెంచరీలతో మెరిసిన వార్నర్, మనీశ్ పాండే...ధోనీసేన టార్గెట్ ఎంతంటే..

CSK vs SRH : ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నెం.2 స్థానంలో చెన్నై కొనసాగుతుండగా.. హైదరబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌లకిగానూ ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన సన్ రైజర్స్ పటిష్ట చెన్నైని ఓడించాలంటే.. కష్టపడాల్సిందే.

ఇంకా చదవండి ...
    ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరెంజ్ ఆర్మీ 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వార్నర్, మనీశ్ పాండే హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. లుంగి ఎంగిడి రెండు వికెట్లతో సత్తా చాటాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు సరియైన శుభారంభం లభించలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న బెయిర్ స్టో తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. 5 బంతుల్లో 7 పరుగులు చేసిన బెయిర్ స్టో .. సామ్ కర్రన్ బౌలింగ్ లో చాహర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వన్ డౌన్ దిగిన మనీశ్ పాండే, వార్నర్ తో కలిసి ఇన్నింగ్స్ ముందుండి నడిపించాడు. ముఖ్యంగా వార్నర్ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వేళ అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. చెత్త బంతుల్ని బౌండరీలు తరలించి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో మనీష్‌ పాండే హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో పాండే ఈ మార్క్‌ను అందుకున్నాడు. 35 బంతులాడి 50 పరుగులు చేశాడు పాండే. ఆ తర్వాత వార్నర్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు 106 పరుగుల విలువైన పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన వార్నర్ లుంగి ఎంగిడి బౌలింగ్ లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హైదరాబాద్ కెప్టెన్ 55 బంతుల్లో 57 పరుగులు చేశాడు. వార్నర్ వికెట్ కోల్పయిన కొద్ది సేపటికే మనీశ్ పాండే కూడా పెవిలియన్ బాట పడ్డాడు. 46 బంతుల్లో 61 పరుగులు చేసిన పాండే.. ఎంగిడి బౌలింగ్ లో డుప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

    ఇక, ఆఖర్లో కేన్ మామ రెచ్చిపోయాడు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 19 ఓవర్లలో 4,6,4,4 లతో రెచ్చిపోయాడు. ఆ ఓవర్ లో హైదరాబాద్ ఏకంగా 20 పరుగులు పిండుకుంది. కేన్ విలియమ్సన్ మెరుపు బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. కేదారా జాదవ్ ఆరు బంతుల్లో 12 పరుగులు చేశాడు.

    ఇక, హెడ్ టు హెడ్ రికార్డుల్లో చెన్నైదే పై చేయిగా కన్పిస్తోంది. ఇరు జట్ల మధ్య 14 మ్యాచ్ లు జరగగా.. చెన్నై 10 మ్యాచ్ ల్లో నెగ్గగా.. హైదరాబాద్ 4 గేమ్స్ ల్లో గెలిచింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, David Warner, IPL 2021, Manish pandey, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు