Home /News /sports /

CSK vs SRH : చెన్నై ఓపెనర్ల జోరు..సన్ రైజర్స్ బేజారు..ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో మరో ఓటమి..

CSK vs SRH : చెన్నై ఓపెనర్ల జోరు..సన్ రైజర్స్ బేజారు..ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో మరో ఓటమి..

CSK vs SRH : చెన్నై ఓపెనర్ల జోరు..సన్ రైజర్స్ బేజారు..ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో మరో ఓటమి..

CSK vs SRH : చెన్నై ఓపెనర్ల జోరు..సన్ రైజర్స్ బేజారు..ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో మరో ఓటమి..

CSK vs SRH : ఛేజింగ్ లు కలిసిరావడం లేదని.. బ్యాటింగ్ దిగి మంచి టోటల్ సెట్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ, ఫలితం మాత్రం మారలేదు. సేమ్ టు సేమ్ పరాజయమే సన్ రైజర్స్ ని పలకరించింది.

    ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ను మరోసారి ఓటమే పలకరించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ల జోరుకు సన్ రైజర్లు బౌలర్లు చేతులేత్తేశారు. ఆ తర్వాత పుంజుకున్నా.. ఫలితం మాత్రమే చెన్నై గెలుపు. దీంతో చెన్నై 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. రషీద్ ఖాన్ మూడు వికెట్లతో సత్తా చాటినా ప్రయోజనం లేకపోయింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ముఖ్యంగా ఓపెనర్లు ఎడాపెడా బాదేశారు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇక, ఆ తర్వాత కూడా డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ లు చెత్త బంతుల్ని బౌండరీలు తరలిస్తూ సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 44 బంతుల్లో 75 పరుగులు చేసి ఊపుమీదున్న రుతురాజ్ గైక్వాడ్ ను రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 129 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కాసేపు మొయిన్ అలీ బ్యాట్ ఝళిపించాడు. 8 బంతుల్లో 15 పరుగులు చేసిన అలీనీ కూడా రషీద్ ఖానే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత డుప్లెసిస్ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. ఈ సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ 38 బంతుల్లో56 పరుగులు చేశాడు. వరుసగా మూడు వికెట్లు తీసి చెన్నై శిబిరంలో టెన్షన్ పెంచాడు రషీద్ ఖాన్. అయితే, మరో వికెట్ జాగ్రత్త పడకుండా మ్యాచ్ ముగించారు సురేష్ రైనా, రవీంద్ర జడేజా.

    అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరబాద్ మంచి ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.మనీష్ పాండే(46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 61), డేవిడ్ వార్నర్( 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీలకు తోడుగా కేన్ విలియమ్సన్(10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. డేవిడ్ వార్నర్, మనీష్ పాండే రెండో వికెట్‌కు 106 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 రన్స్ చేసింది. కేదార్ జాదవ్(4 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 12 నాటౌట్) రాణించాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్ ఓ వికెట్ తీశాడు.

    ఇక, రేపు రెండు మ్యాచ్ లు జరగనున్నాయ్. మొదటి మ్యాచ్ లో ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ తలపడనుంది. ఇక, రెండో ఫైట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, David Warner, IPL 2021, Ms dhoni, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు