• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 CSK VS RR LIVE UPDATES RAJASTHAN ROYALS WON THE TOSS AND OPTED FIELD FIRST SRD

CSK vs RR : అనుభవం వర్సెస్ దూకుడు.. గెలుపెవరిదో..టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్..

CSK vs RR : అనుభవం వర్సెస్ దూకుడు.. గెలుపెవరిదో..టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్..

CSK vs RR : ఓ వైపు మహేంద్ర సింగ్ ధోనీ అనుభవంతో ముందుకు సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. మరోవైపు సంజూ శామ్సన్ దూకుడు మంత్రంతో చెలరేగుతున్న టీమ్. ఈ రెండు జట్ల మధ్య పోరు అభిమానుల్ని అలరించడానికి రెడీ అయింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కి రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై, రాజస్థాన్.. తమ సెకండ్ మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలందుకున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏకపక్ష విజయాన్నందుకుంటే.. ఢిల్లీతో జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. అదే జోరులో ఈ మ్యాచ్‌ను కూడా ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్‌తో జరిగిన పోరులో నాలుగు వికెట్లతో అదరగొట్టిన పేసర్ దీపక్ చాహర్‌పైనే చెన్నై మరోసారి ఆశలు పెట్టుకుంది. అయితే గత మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలింగ్ యూనిట్ సూపర్ సక్సెస్ కావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్ చేలరేగితే ఇక తిరుగుండదు. బ్యాటింగ్‌లోనూ చెన్నై నిలకడగా రాణిస్తోంది. డుప్లెసిస్, మొయిన్ అలీ టచ్‌లో ఉండగా.. రాయుడు, రుతురాజ్ మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. సురేశ్ రైనా మరోసారి కీలకం కానుండగా.. ధోనీ ఫినిషింగ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో డకౌటైన ధోనీకి పంజాబ్‌తో మ్యాచ్‌లో చాన్స్ రాలేదు. ఇక ఈ మ్యాచ్‌కు చెన్నై ఎలాంటి మార్పు లేకుండా విన్నింగ్ టీమ్‌నే కొనసాగించింది.

    మరోవైపు, పంజాబ్ చేతిలో దురదృష్ణవశాత్తూ ఓడిన రాజస్థా రాయల్స్.. ఢిల్లీపై గెలిచి ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుకుంది. గత మ్యాచ్‌లో విఫలమైన రాజస్థాన్ టాపార్డర్ నిలకడ చూపాల్సి ఉంది. ఫస్ట్ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న సంజూశాంసన్ సెకండ్ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతను తన జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు జోస్ బట్లర్, మనన్ ఓహ్రా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాలి. స్టోక్స్ లేకపోవడంతో సీనియర్ ఆటగాళ్లు రాణించడం చాలా ముఖ్యం. అయితే డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్‌తో ఆ జట్టు మిడిలార్డర్ బలంగా ఉంది. వీరికి తోడుగా రియాన్ పరాగ్ కూడా మెరుపులు మెరిపిస్తే బ్యాటింగ్‌‌లో రాజస్థాన్‌కు తిరుగుండదు. యంగ్ పేసర్ చేతన్ సకారియా, సీనియర్ జైదేవ్ ఉనాద్కట్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. వీరికి తోడుగా ముస్తాఫిజుర్ రెహమాన్, క్రిస్ మోరిస్ కీలక సమయంలో అండగా నిలుస్తున్నారు.

    ఇక హెడ్ టు హెడ్ రికార్డులో చెన్నైదే పై చేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు తలపడగా.. 14 విజయాలతో చెన్నైసూపర్ కింగ్సే పైచేయి సాధించింది. రాజస్థాన్ 9 విజయాలకే పరిమితమైంది.

    తుది జట్లు :

    Chennai Super Kings (Playing XI): Ruturaj Gaikwad, Faf du Plessis, Moeen Ali, Suresh Raina, Ambati Rayudu, Sam Curran, MS Dhoni(w/c), Ravindra Jadeja, Dwayne Bravo, Shardul Thakur, Deepak Chahar

    Rajasthan Royals (Playing XI): Jos Buttler, Manan Vohra, Sanju Samson(w/c), Shivam Dube, David Miller, Riyan Parag, Rahul Tewatia, Chris Morris, Jaydev Unadkat, Chetan Sakariya, Mustafizur Rahman
    Published by:Sridhar Reddy
    First published: