• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 CSK VS RR LIVE UPDATES CHENNAI SUPER KINGS WON BY 45 RUNS SRD

CSK vs RR : స్పిన్ తంత్రమే చెన్నై విజయ మంత్రం..రాజస్థాన్ ను చిత్తు చేసిన ధోనీసేన...

CSK vs RR : స్పిన్ తంత్రమే చెన్నై విజయ మంత్రం.. రాజస్థాన్ ను చిత్తు చేసిన ధోనీసేన...

CSK vs RR : అనుభవం వర్సెస్ దూకుడు మధ్య జరిగిన పోరులో అనుభవమే గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ని చిత్తు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చేసింది. ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లింది.

  • Share this:
    ముంబై వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది ధోనీసేన. 45 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగుల మాత్రమే చేసింది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ మూడు వికెట్లతో సత్తా చాటగా..జడేజా, కర్రన్ చెరో రెండు వికెట్లు తీశారు. స్పిన్ ఉచ్చులో బిగ్గించి ఉక్కిరి బిక్కిరి చేసింది. జోస్ బట్లర్ ఒక్కడే 35 బంతుల్లో 49 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్ అంతా చేతులేత్తేశారు.189 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 11 బంతుల్లో 14 పరుగులు చేసిన మనన్ వోహ్రాను పెవిలియన్ పంపాడు సామ్ కర్రన్. ఈ దశలో స్టార్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే, అతనికి సహకరించే బ్యాట్స్ మెన్ కరువయ్యారు. సంజూ శామ్సన్ మరోసారి నిరాశపర్చాడు. 1 పరుగు మాత్రమే చేసి.. సామ్ కర్రన్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. ఇక స్పిన్ బౌలింగ్ లో వరుసగా బౌండరీలు కొట్టిన బట్లర్.. ఆ తర్వాత జడేజా బౌలింగ్ లోనే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయ్. జడేజా, మొయిన్ అలీల స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న రాజస్థాన్ ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే, ఆఖర్లో రాహుల్ తేవటియా, జై దేవ్ ఉనాద్కత్ బ్యాట్ ఝళిపించిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    ఇక, మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బ్యాట్స్‌మన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అందరూ సమిష్టిగా రాణించడంతో పోరాడే స్కోరు చేసింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 రన్స్ చేసి.. రాజస్థాన్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఫాఫ్ డుప్లెసిస్ ‌(33: 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొయిన్‌ అలీ (26: 20 బంతుల్లో 1 ఫోర్‌, 2 ఫోర్లు), అంబటి రాయుడు (27: 17 బంతుల్లో 3 సిక్సర్లు) సమిష్టిగా రాణించారు. సురేశ్ రైనా (18), ఎంఎస్ ధోనీ (18) ధాటిగా ఆడలేకపోయారు. ఇన్నింగ్స్ చివరలో చెన్నై వరుసగా వికెట్లు కోల్పోవడంతో 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయింది. రాజస్థాన్‌ బౌలర్లలో చేతన్‌ సకారియా (3/36), క్రిస్ మోరీస్ ‌(2/33) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మరోసారి ధోనీ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. గతేడాది రాణించకపోయినా ధోనీ.. ఈ సారైనా మెరుపులు మెరిపిస్తాడన్న ఆశలో ఉన్నారు ఫ్యాన్స్. అయితే, ఈ సారి తన ఫామ్ లేమితో వరుస మ్యాచ్ ల్లో ఫెయిలవుతున్నాడు మిస్టర్ కూల్.

    ఈ విక్టరీతో చెన్నై ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయ్. ఇక, రేపు మరో ఆసక్తికర పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
    Published by:Sridhar Reddy
    First published: