• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 CSK VS RR LIVE UPDATES CHENNAI SUPER KINGS SETS FIGHTING TOTAL SRD

CSK vs RR : ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన ధోనీ సేన.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..

CSK vs RR : ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన ధోనీ సేన.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..

CSK vs RR : ముంబై మ్యాచ్ లో ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది ధోనీసేన. ఇక, హెడ్ టు హెడ్ రికార్డులో చెన్నైదే పై చేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు తలపడగా.. 14 విజయాలతో చెన్నైసూపర్ కింగ్సే పైచేయి సాధించింది. రాజస్థాన్ 9 విజయాలకే పరిమితమైంది.

CSK vs RR : ముంబై మ్యాచ్ లో ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది ధోనీసేన. ఇక, హెడ్ టు హెడ్ రికార్డులో చెన్నైదే పై చేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు తలపడగా.. 14 విజయాలతో చెన్నైసూపర్ కింగ్సే పైచేయి సాధించింది. రాజస్థాన్ 9 విజయాలకే పరిమితమైంది.

  • Share this:
    ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై రాజస్థాన్ కు ఫైటింగ్ టోటల్ ను సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. చేతన్ సకారియా 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. ముస్తాఫిజుర్‌ వేసిన నాలుగో ఓవర్‌ ఐదో బంతికి చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(13 బంతుల్లో 10; ఫోర్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. ఈ సీజన్ లో యంగ్ బ్యాట్స్ మన్ వరుసగా విఫలమవుతున్నాడు. ఇక, ఉనద్కత్‌ వేసిన 5వ ఓవర్‌లో 3 ఫోర్లు, సిక్స్‌ సహా మొత్తం 19 పరుగులు పిండుకున్న డుప్లెసిస్‌(17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు).. క్రిస్‌ మోరిస్‌ వేసిన మరుసటి ఓవర్లోనే ఔటయ్యాడు. మోరిస్‌ వేసిన బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో రియన్‌ పరాగ్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత నిలకడగా ఆడిన మొయిన్ అలీ(20 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు) తెవాతియా ఉచ్చులో చిక్కాడు. తెవాతియా బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన మొయిన్‌... రియాన్‌ పరాగ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు.ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాయుడు.. రియాన్‌ పరాగ్‌ వేసిన 11వ ఓవర్‌లో సిక్సర్‌ .. తెవాతియా వేసిన 12వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. వేగంగా ఆడి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించిన రాయుడు(17 బంతుల్లో 27; 3 సిక్సర్లు).. సకారియా బౌలింగ్‌లో స్వీపర్‌ కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రియాన్‌ పరాగ్‌ చేతికి క్యాచ్‌ అందించి వెనుదిరిగాడు.

    ఆ వెంటనే రైనా(15 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌) కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. సకారియా బౌలింగ్‌లో మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మోరిస్‌ సింపుల్‌ క్యాచ్‌ అందుకోవడంతో రైనా వెనుదిరిగాడు. బ్యాటింగ్ లో ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడాతాడనుకున్న ధోనీ మరోసారి నిరాశపర్చాడు. 17 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆఖర్లో సామ్ కర్రన్, బ్రావో మెరుపులతో చెన్నై ఈ టోటల్ ను సెట్ చేసింది.

    ఇక హెడ్ టు హెడ్ రికార్డులో చెన్నైదే పై చేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు తలపడగా.. 14 విజయాలతో చెన్నైసూపర్ కింగ్సే పైచేయి సాధించింది. రాజస్థాన్ 9 విజయాలకే పరిమితమైంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు