చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) సూపర్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ కేఎల్ రాహుల్( KL Rahul Super Batting) సూపర్ బ్యాటింగ్ తో పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసింది పంజాబ్. రాహుల్ సూపర్ బ్యాటింగ్ తో 135 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కేవలం 13 ఓవర్లలో ఛేజ్ చేసింది. 13 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. రాహుల్ 42 బంతుల్లో 98 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయంటే అర్ధం చేసుకోవచ్చు.. రాహుల్ ఎలాంటి విధ్వంసం సృష్టించాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో రాణించాడు.135 పరుగుల సాధారణ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటింగ్ కేఎల్ రాహుల్ సూపర్ స్టార్. మయాంక్ అగర్వాల్ 12 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్, షారుఖ్ ఖాన్ 8 పరుగులు, మర్కరమ్ 13 పరుగులతో నిరాశపర్చిన.. రాహుల్ మాత్రం చెన్నై బౌలర్లకు చుక్కలు చూపాడు. అతని బ్యాటింగ్ ముందు చెన్నై బౌలర్లు తేలిపోయారు. దొరికిన చెత్త బాల్ ను దొరికినట్లు బాదేస్తూ చెన్నై బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. రాహుల్ సూపర్ బ్యాటింగ్ కు అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ విక్టరీతో పంజాబ్ 12 పాయింట్లతో ఆరో స్ధానానికి ఎగబాకింది. ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే ఇతర జట్టుల గెలుపోటములు, నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంది. చెన్నై 14 మ్యాచ్ ల్లో 9 విక్టరీలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక, అంతకు ముందు.. ఫాఫ్ డుప్లెసిస్(55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) ఒంటరి పోరాటం చేయడంతో పంజాబ్ కింగ్స్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
.@klrahul11 leading from the front! ? ?
The @PunjabKingsIPL captain brings up a 25-ball fifty. ? ? #VIVOIPL #CSKvPBKS
Follow the match ? https://t.co/z3JT9U9tHZ pic.twitter.com/4IZR8xuZv5
— IndianPremierLeague (@IPL) October 7, 2021
ఐపీఎల్ 2021 సీజన్లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. వికెట్ నుంచి లభించిన సహకారాన్ని పంజాబ్ బౌలర్లు సమష్టిగా రాణించారు.ఓ దశలో 61 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ డుప్లెసిస్ ధాటిగా ఆడి జట్టుకు కనీసం పోరాడే లక్ష్యాన్ని అందించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, షమీ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL 2021, KL Rahul, MS Dhoni, Punjab kings