ఐపీఎల్ 2021(IPL 2021 Season Latest Updates) సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు (Play Off Race) ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చెన్నై (CSK), ఢిల్లీ (DC), బెంగళూరు (RCB) ప్లే ఆఫ్స్ చేరుకోగా.. నాలుగో స్థానం కోసం అసలు పోరాటం మొదలైంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరో ఆసక్తిపోరుకు తెర లేవనుంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లో క్రిస్ జోర్డాన్ ను మ్యాచ్ లోకి తీసుకుంది పంజాబ్ కింగ్స్. మరోవైపు, సురేష్ రైనాను పక్కన పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. రాబిన్ ఉతప్పను కంటిన్యూ చేసింది. ఇక, టాప్ -2 లో నిలవడం కోసం ధోనీ సేన ప్రయత్నిస్తోంది. టాప్ -2 లో నిలిస్తే.. ఫైనల్ కి చేరడానికి రెండు ఛాన్సులు ఉండటంతో.. చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా పోరాడటానికి రెడీ అయింది.
చెన్నై జట్టులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్‌లో ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మొదట బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా వీరు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. వీరికి తోడు మొయిన్ అలీ, అంబటి రాయుడులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అలీ వేగంగా ఆడుతూ విలువైన పరుగులు చేస్తున్నాడు. అయితే మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. గత మ్యాచ్ లో రైనా బదులు ఉతప్ప జట్టులోకి వచ్చాడు. ఇక, జడేజా రూపంలో చెన్నై జట్టులో సూపర్ ఆల్ రౌండర్ ఉన్నాడు. మూడు విభాగాల్లో చెలరేగుతూ.. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా నిలిచాడు రవీంద్రుడు. ఇక, బౌలింగ్ లో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జోష్ హాజెల్ వుడ్ లు కీలకం కానున్నారు.
? Toss Update ?@PunjabKingsIPL have elected to bowl against @ChennaiIPL. #VIVOIPL #CSKvPBKS
Follow the match ? https://t.co/z3JT9U9tHZ pic.twitter.com/H94DPnktyv
— IndianPremierLeague (@IPL) October 7, 2021
పంజాబ్ టీమ్ లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. చెప్పాలంటే వీరిద్దరి మీదే వారి బ్యాటింగ్ ఆధారపడి ఉంది. మార్కరమ్, పూరన్, షారుఖ్ ఖాన్ లు రాణిస్తే పంజాబ్ కు తిరుగుండదు. బౌలింగ్ లో షమీ, అర్ష దీప్ సింగ్ రాణిస్తున్నారు. స్పిన్ బౌలింగ్ లో రవి బిష్ణోయ్ కీలకం కానున్నాడు.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఇక, ఇరు జట్ల మధ్య 24 సార్లు మ్యాచ్ లు జరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ దే సంపూర్ణ ఆధిపత్యం. 15 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ నెగ్గగా.. 9 సార్లు పంజాబ్ గెలిచింది.
తుది జట్లు :
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్.
పంజాబ్ కింగ్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఏడైన్ మర్కరమ్, సర్పరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్,హర్ ప్రీత్ బార్, మోజెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డన్, మహ్మద్ షమీ,రవి బిష్ణోయ్, అర్ష దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL 2021, KL Rahul, MS Dhoni, Punjab kings