IPL 2021 - CSK Vs PBKS : పంజాబ్ బౌలర్లు భల్లే భల్లే.. డుప్లెసిస్ సూపర్ షో.. టార్గెట్ ఎంతంటే..

Photo Credit : Twitter

IPL 2021 - CSK Vs PBKS : ఫామ్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ను పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సాధారణ స్కోరుకు పరిమితమైంది ధోనీ సేన.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్‌ (IPL 2021 Season Latest Updates)లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ (CSK Vs PBKS)లో చెన్నై సూపర్ కింగ్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. చెన్నై ఇన్నింగ్స్ లో డుప్లెసిస్ బ్యాటింగే హైలెట్. ఈ స్టైలిష్ బ్యాటర్ ( 55 బంతుల్లో 76 పరుగులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తో రాణించాడు. ఐపీఎల్ కెరీర్ లో డుప్లెసిస్ కి ఇది 21 వ హాఫ్ సెంచరీ. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లతో మెరిశారు. షమీ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ టార్గెట్ 135 పరుగులు.టాస్ ఓడిపోయి స్వల్ప స్కోరుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి అర్ష్‌దీప్ సంగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా... మొయిన్ ఆలీ ఆరు బంతులాడి డకౌట్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో బ్యాటుతో అదరగొట్టిన మొయిన్ ఆలీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

    ఆ తర్వాత రాబిన్ ఊతప్ప 6 బంతుల్లో 2 పరుగులు, అంబటి రాయుడు 5 బంతుల్లో 4 పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది సీఎస్‌కే. ఆ తర్వాత ధోనీ మరో సారి నిరాశపర్చాడు. 15 బంతుల్లో 12 పరుగులు చేసిన ధోనీ రవి బిష్ణోయ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


    ఆ తర్వాత చెన్నై ఇన్నింగ్స్ ని చక్కదిద్దాడు ఫాఫ్ డుప్లెసిస్. చూడచక్కని బౌండరీలు ఆడుతూ చెన్నై ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో జడేజాతో కలిసి.. భారీ షాట్లు ఆడిన డుప్లెసిస్.. పంజాబ్ ముందు ఫైటింగ్ టోటల్ సెట్ చేశాడు. ఆఖర్లో షమీ బౌలింగ్ లో రాహుల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు డుప్లెసిస్.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ఇక, ఇరు జట్ల మధ్య 24 సార్లు మ్యాచ్ లు జరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ దే సంపూర్ణ ఆధిపత్యం. 15 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ నెగ్గగా.. 9 సార్లు పంజాబ్ గెలిచింది.
    Published by:Sridhar Reddy
    First published: