హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: మళ్లీ పొట్టి క్రికెట్ సందడి.. నేటి నుంచి ఐపీఎల్-2021 రెండో దశ ప్రారంభం

IPL 2021: మళ్లీ పొట్టి క్రికెట్ సందడి.. నేటి నుంచి ఐపీఎల్-2021 రెండో దశ ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IPL 2021: ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్‌ను ఆన్‌లైన్‌లో హాట్‌స్టార్, జియోటీవీలో చూడవచ్చు. ఇక మనదేశంలో స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ HD ఛానెళ్లలో ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ ప్రసారం కానున్నాయి.

ఇంకా చదవండి ...

  IPL 2021: మళ్లీ పొట్టి క్రికెట్ సందడి మొదలు కాబోతోంది. అసలు సిసలైన క్రికెట్ వినోదం అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. నేటి నుంచి యూఏఈ (UAE) వేదికగా కొనసాగనుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్లు తలపడతాయి. గత ఏడాది కూడా యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే దుబాయ్ (Dubai), అబుదాబి (Abudhabi), షార్జా (Sharjah) క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్-2021 రెండో భాగంలో.. 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబరు 8న లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ ఢీకొడుతుంది. మొదటి క్వాలిఫైయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న దుబాయ్‌లో జరుగుతుంది. ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు షార్జా వేదికగా అక్టోబరు 11, అక్టోబరు 13న నిర్వహిస్తారు.

  T-20 World Cup : టీ -20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్, టైమింగ్స్, గ్రూప్‌ల వారీగా వివరాలు

  ఇవాళ దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 07.30కి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్‌లోనే రెండు బలమైన జట్లు పోటీపడుతుండడంతో అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ఈసారి స్టేడియంలోకి ప్రేక్షకులను కూడా అనుమతిస్తున్నారు. ఐతే మరీ ఎక్కువ మంది కాకుండా.. పరిమిత సంఖ్యలోనే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారు. స్టేడియంలో ప్రేక్షకుల సందడి ఈ సీజన్‌కు మరింత కిక్కు ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  IPL 2021: ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ పేరుతో ఉన్న ఓ చెత్త రికార్డు తెలుసా?


  ఇక ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా అక్టోబరు 15న జరుగుతుంది. మొత్తంగా దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ టాప్‌లో ఉంది. 12 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఐపీఎల్ 2021 ప్రారంభమయింది. ఐతే అప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో పలువురు ఆటగాళ్లతో పాటు సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ అప్రమత్తమై ఐపీఎల్ 2021ని నిలిపివేసింది. మే2న పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ అనంతరం.. ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 4 నెలల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ సందడి మొదలవబోతోంది.

  IPL 2021: ఇండియా నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్దామనుకుంటున్నారా? వీరికి మాత్రమే ఎంట్రీ

  ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్‌ను ఆన్‌లైన్‌లో హాట్‌స్టార్, జియోటీవీలో చూడవచ్చు. ఇక మనదేశంలో స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ HD ఛానెళ్లలో ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ ప్రసారం కానున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Chennai Super Kings, Cricket, Indian premier league, IPL 2021, Mumbai Indians, Sports

  ఉత్తమ కథలు