హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : ఐపీఎల్ టీమ్స్ పారాహుషార్..! ధోనీ వస్తున్నాడు...సిక్సర్లతో చెలరేగిన తలైవా...వైరల్ వీడియో..

IPL 2021 : ఐపీఎల్ టీమ్స్ పారాహుషార్..! ధోనీ వస్తున్నాడు...సిక్సర్లతో చెలరేగిన తలైవా...వైరల్ వీడియో..

ధోనీ (Photo Credit : Twitter)

ధోనీ (Photo Credit : Twitter)

IPL 2021 : మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) బ్యాట్ పడితే ధనా ధన్.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ అడుగు పెడితే రికార్డుల మోత.. ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) బ్యాట్ పడితే ధనా ధన్.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ అడుగు పెడితే రికార్డుల మోత.. ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మళ్లీ నెట్స్​ ప్రక్టీస్‌లో తెగ బిజీగా మారిపోయాడు. ఐపీఎల్​ 14వ సీజన్​ మలిదశ కోసం బ్యాట్‌ పట్టి సిక్సులతో పిచ్చెక్కిస్తున్నాడు. గత సీజన్‌, ఈ సీజన్ ఫస్టాఫ్ లో దారుణంగా విఫలమైన మహీ.. ఈ సారి అదరగొట్టాలనే సంకల్పంతో సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో యూఏఈలో అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్ షురూ చేసిన చెన్నై.. టైటిలే లక్ష్యంగా సిద్దమవుతోంది. ప్రాక్టీస్ మొదలు పెట్టిన మొదటి రోజే మైదానంలో సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు తలైవా. ప్రాక్టీస్‌ సందర్భంగా ధోనీ పలు బంతులను స్టాండ్స్‌లోకి తరలించిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్​ పోస్ట్ చేసింది. ధోనీ ఆడిన షాట్లలో తన ఫేవరెట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువసార్లు ఆడాడు. ధోనీ ఒక్కో షాట్‌ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గత సీజన్‌ మాదిరిగానే దుబాయ్‌, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహిస్తున్నారు. బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో మే మొదటి వారంలో ఈ మెగా టోర్నీ వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఎన్నో అవాంతరాల తర్వాత మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది.

సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో పలు ఫ్రాంచైజీలు బయోబుడగలను ఏర్పాటు చేసి తమ ఆటగాళ్లను యూఏఈకి తరలిస్తున్నాయి. ఐపీఎల్ 2021 కోసం చెన్నై టీమ్ ఆగస్టు 13న దుబాయ్ చేరుకుంది. వారం రోజుల పాటు దుబాయ్‌లోని పామ్‌ హోటల్‌లో చెన్నై ప్లేయర్స్ క్వారంటైన్ అయ్యారు. క్వారంటైన్ గడువు గురువారం పూర్తవడంతో దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో చెన్నై ప్లేయర్స్ ప్రాక్టీస్ ఆరంభించారు. గత మూడు రోజులుగా చెన్నై ఆటగాళ్లు దుబాయ్ మైదనంలో సాధన చేస్తున్నారు. చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆటగాళ్ల సాధనను దగ్గరుండి మరి పరీక్షించాడు.


చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, పేసర్ దీపక్ చహర్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప, స్పిన్నర్ కరన్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీస్ సందర్భంగా మహీ కసిగా కనిపించాడు. బంతి పడడమే ఆలస్యం.. భారీ సిక్సర్లు సంధించాడు. స్పిన్,పేస్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. మహీ కొట్టిన ఓ బంతి మైదానం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'ధోనీ ఆవాజ్‌' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి.

First published:

Tags: Chennai Super Kings, Cricket, IPL 2021, MS Dhoni, Suresh raina, Viral Video

ఉత్తమ కథలు