Home /News /sports /

IPL 2021 CONTROVERSIAL THIRD UMPIRE DECISION IN KKR VS PBKS MATCH MAKES DEBATE AND FORMER CRICKETERS SLAMS SRD

IPL 2021 : ఏమయ్యా థర్డ్ అంపైర్.. ఇది ఔట్ కాదా..? కేవలం నీ వల్లే పంజాబ్ గెలిచింది..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IPL 2021 : సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు తప్పిదాలు చేయడం చూస్తుంటాం. కానీ, ధర్డ్ అంపైర్ తప్పు చేయడం అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే, ధర్డ్ అంపైర్ కి టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది.

    ఐపీఎల్ 2021లో (IPL 2021) ప్లే ఆఫ్స్ (Play Offs) బెర్తు కోసం సాగుతున్న రేసు రసవత్తరంగా సాగుతోంది. రోజుకో వైవిధ్యమైన ఫలితంతో చివరకు ఎవరు ప్లే ఆఫ్స్‌కు వెళ్తారో అర్దం కావడం లేదు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) - పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (67), మయాంక్ అగర్వాల్ (40) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్‌లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరిలో కేఎల్ రాహుల్ కూడా అవుటైనా షారుక్ ఖాన్ (22) భారీ షాట్లు ఆడటంతో పంజాబ్ విజయం సాధించింది. మంచి ఓపెనింగ్ పార్టరన్‌షిప్ తర్వాత వికెట్లు పడ్డాయి. కానీ కెప్టెన్ కేఎల్ రాహుల్ (67) (KL Rahul) చివరి వోవర్ వరకు నిలబడ్డాడు. విజయానికి మరో 4 పరుగులు కావల్సిన సమయంలో కేఎల్ రాహుల్ వికెట్ పారేసుకున్నాడు.

    అంతకు ముందు ఓవర్లోనే రాహుల్ అవుట్ బారి నుంచి తప్పించుకున్నా.. కీలక సమయంలో వికెట్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత బంతికే షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) ఆడిన భారీ షాట్‌ను త్రిపాఠి క్యాచ్ వదిలేశాడు. అంతే కాకుండా ఆ బాల్ బౌండరీ అవతల పడటంతో సిక్స్‌గా మారింది. చివరి వరకు టెన్షన్ పెట్టిన పంజాబ్ చివరకు విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ ఓటమితో ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ బెర్త్ ఖాయమైంది.

    అయితే, చివరి రెండు ఓవర్లలో 15 పరుగులు చేయాల్సి ఉండగా జట్టుకు అదృష్టం లభించింది.ఆ సమయంలో పంజాబ్ జట్టు 52 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ కొట్టిన బంతిని రాహుల్ త్రిపాఠి అద్భుతంగా క్యాచ్ పట్టాడు.




    అయితే.. ఆ క్యాచ్ ని ధర్డ్ అంపైర్ పట్టించుకోకపోవడం గమనార్హం. అంపైర్.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు. అయితే.. అంపైర్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసింది. అది క్లియర్ గా ఔట్ అని తెలిసినా.. ఇవ్వలేదని సీనియర్ క్రికెటర్ల దగ్గర నుంచి నెటిజ్ల వరకు అందరూ విమర్శించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో చివరికు విజయం పంజాబ్ కే దక్కింది.


    ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే, క్రికెట్ ప్రియులు, అభిమానులు ట్విట్టర్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, క్రికెటర్ అభినవ్ ముకుంద్ ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. అది ఔట్ లాగా కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IPL 2021, KL Rahul, Kolkata Knight Riders, Punjab kings

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు