• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • IPL 2021 CHENNAI SUPER KINGS SKIPPER MAHENDRA SINGH DHONI SAYS HE WILL BE THE LAST PERSON TO BOARD THE FLIGHT BACK HOME SRD

MS Dhoni : ధోనీ ఏంటి ఇలాంటి శపథం చేశాడు..? అప్పటి వరకు రాంచీలో అడుగు పెట్టడంట...

MS Dhoni : ధోనీ ఏంటి ఇలాంటి శపథం చేశాడు..? అప్పటి వరకు రాంచీలో అడుగు పెట్టడంట...

MS Dhoni : ధోనీ ఏంటి ఇలాంటి శపథం చేశాడు..? అప్పటి వరకు రాంచీలో అడుగు పెట్టడంట..

MS Dhoni : సాఫీగా సాగుతున్న ఐపీఎల్ ఎక్స్ ప్రెస్ కు కరోనా బ్రేకులు వేసింది. ఐపీఎల్ అర్ధంత‌రంగా ముగియ‌డంతో అందులోని ప్లేయ‌ర్స్‌, ఇత‌ర సిబ్బంది వారి వారి ఇళ్ల‌కు వెళ్ల‌డం చాలా క‌ష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ క‌ష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ధోనీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 • Share this:
  భారత్ లో కరోనా (Corona) కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ మహమ్మారి దెబ్బకి చాలా రంగాలు షేక్ అయ్యాయ్. క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది కరోనా. ఇక, తాజాగా.. కరోనా దెబ్బకు ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ కూడా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పటిష్టమైన బయో బబుల్ లో కూడా కరోనా ప్రవేశించింది. ఆ తర్వాత ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్థారణ అవ్వడంతో క్యాష్ రీచ్ లీగ్ ను బీసీసీఐ అర్థాంతరంగా నిలిపివేసింది. దీంతో..బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఆటగాళ్లని తమ స్వస్థలాలకు పంపించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ అర్ధంత‌రంగా ముగియ‌డంతో అందులోని ప్లేయ‌ర్స్‌, ఇత‌ర సిబ్బంది వారి వారి ఇళ్ల‌కు వెళ్ల‌డం చాలా క‌ష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ క‌ష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. వారికి దేశంలోకి మే 15 వ‌ర‌కూ నో ఎంట్రీ అని ఆస్ట్రేలియా చెప్ప‌డంతో ఇండియా నుంచి మాల్దీవ్స్‌కు వెళ్లి.. అక్క‌డి నుంచి ఎలాగోలా ఇంటికి వెళ్లాల‌ని చూస్తున్నారు. ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్ ఇప్ప‌టికే సేఫ్‌గా ఇంటికెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ.. త‌న టీమ్‌లోని ప్లేయ‌ర్స్‌కు అండ‌గా నిలుస్తున్నాడు. ప్ర‌తి ఒక్క‌రూ సుర‌క్షితంగా ఇంటికి వెళ్లిన త‌ర్వాతే తాను ఇంటికి వెళ్తాన‌ని, క్యాంప్ నుంచి ఇంటికి వెళ్లే ఆఖ‌రి వ్య‌క్తి తానే అవుతాన‌ని ధోనీ చెప్ప‌డం విశేషం.

  చెప్పిన‌ట్లే ప్రతి ఒక్క‌రూ సుర‌క్షితంగా ఇంటికి చేరారా లేదా అన్న‌ది ఆరా తీస్తున్నాడు. ముందు విదేశీ ప్లేయ‌ర్స్ వెళ్లాల‌ని, త‌ర్వాత దేశీయ ఆట‌గాళ్లు వెళ్లాల‌ని ఓ వీడియో చాట్‌లో ధోనీ చెప్పాడు. చివ‌ర‌గా తాను వెళ్తాన‌ని ధోనీ అన్న‌ట్లు ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్ల‌డించింది.మ‌హీభాయ్ అంద‌రూ సుర‌క్షితంగా ఇంటికి వెళ్లార‌ని తెలిసిన త‌ర్వాతే హోట‌ల్ నుంచి వెళ్తాన‌ని చెప్పాడు. హోట‌ల్ నుంచి చివ‌రిగా వెళ్తే వ్య‌క్తి తానేన‌ని ధోనీ అన్నాడు అని చెన్నై టీమ్ స‌భ్యుడు ఒక‌రు వెల్ల‌డించాడు. త‌మ ప్లేయ‌ర్స్‌ను చెన్నై చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లో ముంబై, రాజ్‌కోట్‌ల‌కు త‌ర‌లించింది. మ‌రో విమానంలో కొంద‌రు ప్లేయ‌ర్స్‌ను బెంగ‌ళూరు, చెన్నైల‌కు పంపించింది. ఈ ప్లేయర్లందరూ ఇంటికి చేరుకున్నాకే.. ధోనీ రాంచీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

  ఇక ముంబై ఇండియ‌న్స్ మాత్రం త‌మ విదేశీ ప్లేయ‌ర్స్ అంద‌రినీ చార్ట‌ర్డ్ విమానాల్లో పంపిస్తుండ‌టం విశేషం. ఇలా విదేశీ ప్లేయ‌ర్స్‌కు ప్ర‌త్యేక ఏర్పాటు చేసిన టీమ్ ఇదొక్క‌టే. ఈ విమానాలు సౌతాఫ్రికా మీదుగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్ వెళ్ల‌నున్నాయి. మిగ‌తా ఐపీఎల్ టీమ్స్‌లో ఉన్న ప్లేయ‌ర్స్‌ను కూడా తీసుకెళ్తామ‌ని ముంబై టీమ్ చెప్ప‌డం విశేషం. ఐపీఎల్‌ 2021లో భాగంగా ఉన్న 11 మంది ఇంగ్లండ్‌ క్రికెటర్లలో ఎనిమిది మంది లండన్‌కు చేరుకున్నారు. బట్లర్, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్, టామ్‌ కరన్, వోక్స్, బెయిర్‌స్టో, జేసన్‌ రాయ్, స్యామ్‌ బిల్లింగ్స్‌ బుధవారం ఉదయమే హీత్రూ విమానాశ్రయానికి వచ్చారని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మరో ముగ్గురు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మోర్గాన్, జోర్డాన్, మలాన్‌ రెండు రోజులు ఆలస్యంగా బయలుదేరుతారు. వీరంతా అక్కడి నిబంధనల ప్రకారం పది రోజుల పాటు గవర్నమెంట్ ఆమోదం పొందిన హోటల్‌లలో 10 రోజులు పాటు క్వారంటైన్‌లో ఉంటారు.
  Published by:Sridhar Reddy
  First published: