IPL 2021 : ఆర్మీ మీద మరోసారి ధోనీ అభిమానం..ఈ సారి స్పెషల్ జెర్సీతో బరిలోకి CSK..

Photo Credit : Instagram

IPL 2021 : భారత మాజీ కెప్టెన్ ధోనీ ఆర్మీపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. క్రికెట్‌ కిట్, గ్లవ్స్‌లతో పాటు తన దుస్తులపై కూడా చాలాసార్లు భారత ఆర్మీ "క్యామోఫ్లాజ్‌" ప్రింట్‌ను ధరించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జెర్సీలపై కూడా దానిని తీసుకొచ్చాడు.

  • Share this:
    భారత మాజీ కెప్టెన్ ధోనీ ఆర్మీపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. క్రికెట్‌ కిట్, గ్లవ్స్‌లతో పాటు తన దుస్తులపై కూడా చాలాసార్లు భారత ఆర్మీ "క్యామోఫ్లాజ్‌" ప్రింట్‌ను ధరించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జెర్సీలపై కూడా దానిని తీసుకొచ్చాడు. ఐపీఎల్‌ 2021 సీజన్ కోసం సీఎస్‌కే రూపొందించిన కొత్త జెర్సీలో ఆటగాళ్ల భుజాలపై ఈ 'క్యామోఫ్లాజ్‌' కనిపిస్తుంది. ఈ జెర్సీని బుధవారం ధోని స్వయంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ధోనికి భారత ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా గౌరవ హోదా కూడా ఉంది. భారత సైనికులకు సంఘీభావంగా ‘క్యామోఫ్లాజ్'ను ముద్రించినట్లు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. భారత సైనికులకు సంఘీభావంగా ఈ ప్రింట్‌ను ముద్రించినట్లు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. సాయుధ దళాలకు సంబంధించి నిస్వార్థ పాత్ర గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నించాలనుకున్నాం. చివరికి ఈ విధంగా సాధ్యమైంది. వారు నిజమైన హీరోలు" అని జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్కే సీఈఓ విశ్వనాథన్ వెల్లడించాడు. 2010, 2011, 2018లలో మూడు సార్లు ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్​ ట్రోఫీని అందుకుంది. ఇందుకు గుర్తుగా సీఎస్‌కే మూడు స్టార్లను జెర్సీపై ఉంచింది.

    సీఎస్కే.. సాయుధ దళాలపై తమకున్న ప్రత్యేక ప్రేమను చాటుకుంది. 2019 ఐపీఎల్​కు ముందు కూడా రూ.2 కోట్ల చెక్కును సాయుధ బలగాలకు అందించింది. జెర్సీ భుజ భాగంలో ఆర్మీ గోల్డ్​ బ్యాండ్​ కనిపించేలా తయారు చేశారు. ఇది సీఎస్కే నిలకడకు, ఫెయిర్ ప్లేకు నిదర్శనమని చెన్నై భావిస్తోంది. మొత్తం 11 సీజన్లలో చెన్నై 5 సార్లు ఫెయిర్​ ప్లే అవార్డును కైవసం చేసుకుంది. జెర్సీ కావాల్సిన అభిమానులు తమ వెబ్​సైట్​ను సందర్శించాలని సీఎస్కే పేర్కొంది.



    అయితే ఈ కొత్త జెర్సీని ఆవిష్కరిస్తున్న వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టా వేదికగా పంచుకోగా.. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తనదైన శైలిలో కామెంట్ చేశాడు.ప్లీజ్ నాకొక ఎల్ సైజ్ ఇవ్వరా? అని కామెంట్ చేశాడు. దీనికి సీఎస్‌కే.. "మీ కోసం ఇప్పటికే సిద్దం చేశాం సర్.. ముంబైలో ఇస్తాం. త్వరగా రండి"అని బదులిచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే తమ ట్రైనింగ్ క్యాంప్ ను ప్రారంభించింది. ధోనీ, ఇప్పటికే యంగ్ క్రికెటర్ల చేత వినూత్న రితీలో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో యంగ్ క్రికెటర్లకు మెళుకువలు నేర్పిస్తున్నాడు ధోనీ.
    Published by:Sridhar Reddy
    First published: