Home /News /sports /

IPL 2021: సాధారణ బార్బర్‌కు ఊహించని జాక్‌పాట్.. ఐపీఎల్ పుణ్యాన రాత్రికి రాత్రే కోటీశ్వరుడు

IPL 2021: సాధారణ బార్బర్‌కు ఊహించని జాక్‌పాట్.. ఐపీఎల్ పుణ్యాన రాత్రికి రాత్రే కోటీశ్వరుడు

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IPL 2021 Dream 11 winner: కోటి రూపాయలు వచ్చినా.. తన వృత్తిని మాత్రం వదులుకోనని స్పష్టం చేశాడు అశోక్. తనకు క్షరక వృతి అంటేనే ఎంతో ఇష్టమని చెప్పాడు. బెట్టింగ్‌ ద్వారా వచ్చిన రూ.కోటితో అప్పులను తీర్చి, మిగిలిన డబ్బులతో మంచి ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు.

ఇంకా చదవండి ...
  అతడు సాధారణ క్షరకుడు (Barber). హెయిర్ కటింగ్ (Hair Cut) తప్ప ఇంకే పని రాదు. కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. తన సెలూన్ దుకాణమే ఆ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు. అలాంటి క్షరకుడికి ఊహించని అదృష్టం వరించింది. ధనలక్ష్మి అతడి ఇంటి తలుపు తట్టింది. ఏకంగా కోటి రూపాయలు తీసుకొచ్చింది. ఐపీఎల్ (IPL 2021) పుణ్యామా అని.. డ్రీమ్ 11 (Dream 11) రూపంలో.. అదిరిపోయే జాక్ పాట్ తగిలింది. ఇంకేం.. అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా కోటీ రూపాయలు గెలవడంతో అతడి జీవితమే మారిపోయింది. బీహార్‌ (Bihar)లోని మధుబనీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

  అశోక్‌ కుమార్‌ ఠాకుర్‌ అనే వ్యక్తి మధుబనీ జిల్లాలో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్‌ అంటే అతడికి ఎంతో ఆసక్తి. ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తుండడంతో ‘డ్రీమ్‌-11’లో అశోక్‌ తరచూ బెట్టింగ్‌ పెట్టేవాడు. ఎన్నో సార్లు కాంటెస్ట్‌ల్లో పాల్గొన్నా ఎప్పుడూ పెద్దగా డబ్బులు రాలేదు. అయినా నిరుత్సాహ పడకుండా తక్కువ మొత్తంలోనే పోటీలో పాల్గొనేవాడు. ఎప్పటిలాగే ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌పై కూడా బెట్టింగ్‌ పెట్టాడు అశోక్. కేవలం 50 రూపాయలతో కోటి రూపాయల కాంటెస్ట్‌లో పాల్గొన్నాడు. ఐతే ఆ రోజు అనూహ్యంగా అతడే విజేతగా నిలిచాడు. కోటి రూపాయల కాంటెస్ట్‌లో మొదటి స్థానంలో నిలవడంతో రూ.కోటి ప్రైజ్ మనీ అతడిని వరించింది. ఈ విషయం తెలియగానే అశోక్‌ ఆనందానికి అవధులు లేవు. గతంలో ఎన్నోసార్లు బెట్టింగ్‌ పెట్టానని, ఎప్పుడూ గెలవలేదని ఈ సందర్భంగా అశోక్ చెప్పాడు. కానీ ఇప్పుడు కోటి రూపాయలు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

  IPL New Teams: ఐపీఎల్‌లో కొత్త జట్లను ఎప్పుడు ప్రకటిస్తుందో చెప్పిన బీసీసీఐ..!

  మ్యాచ్ ముగిసిన తర్వాత నేను మొదటి స్థానంలో నిలిచాడు. ఆ కాంటెస్ట్‌లో రూ.కోటి వచ్చాయి. కాసేపటికే అధికారికంగా ఫోన్ కాల్ వచ్చింది. రాబోయే రెండు మూడు రోజుల్లో మీ ఖాతాలో రూ.70 లక్షలు జమవుతాయని చెప్పారు. కోటి రూపాయల్లో పన్నులు పోగా మిగతా డబ్బులు నాకు అందుతాయి. ఆ రోజు సంతోషంగా రాత్రంతా నిద్రపట్టలేదు. అని అశోక్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

  ఒకే రోజు.. ఒకే సమయంలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. లీగ్ చరిత్రలో తొలిసారి..

  కోటి రూపాయలు వచ్చినా.. తన వృత్తిని మాత్రం వదులుకోనని స్పష్టం చేశాడు అశోక్. తనకు క్షరక వృతి అంటేనే ఎంతో ఇష్టమని చెప్పాడు. బెట్టింగ్‌ ద్వారా వచ్చిన రూ.కోటితో అప్పులను తీర్చి, మిగిలిన డబ్బులతో మంచి ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు.

  హోటల్ గదిలోనే వార్నర్.. గ్రౌండ్‌కు ఎందుకు రాలేదని ఫ్యాన్స్ అయోమయం.. క్లారిటీ ఇచ్చిన కోచ్

  కాగా, డ్రీమ్ 11లో ఇవాళ మ్యాచ్ జరిగే జట్ల నుంచి ప్లేయర్స్‌ను ఎంచుకొని యూజర్లు తమ డ్రీమ్ జట్టును తయారు చేసుకుంటారు. మ్యాచ్‌లో ఆయా ఆటగాళ్లు ప్రదర్శన ఆధారంగా పాయింట్లు వస్తాయి. ఆ కంటెస్ట్‌లో విజయం సాధించిన వారు డబ్బులు గెలుచుకోవచ్చు. ఇందులో ఎన్నో రకాల కంటెస్ట్‌లు ఉంటాయి. ఔత్సాహికులు డబ్బులు చెల్లించి తమకు నచ్చిన కంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో చాలా మంది యువత పలు పెయిడ్ కంటెస్ట్‌లలో డబ్బులు పెట్టి ఫాంటసీ క్రికెట్ ఆడుతున్నారు. ఐతే డ్రీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌పై ఏపీ, తెలంగాణ, అసోం, ఒడిశా, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో నిషేధం అమల్లో ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, Dream 11, IPL 2021, Sports

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు