• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 BIG SHOCK TO SUNRISERS HYDERABAD KANE WILLAMSON AND JOHNY BAIRSTOW MAY MISS THE REMAINING SEASON SRD

IPL 2021 : SRHకి భారీ షాక్..మిగతా సీజన్ కు కేన్ మామతో పాటు ఆ స్టార్ ప్లేయర్ కూడా దూరం..!

IPL 2021 : SRHకి  భారీ షాక్..మిగతా సీజన్ కు కేన్ మామతో పాటు ఆ స్టార్ ప్లేయర్ కూడా దూరం..!

IPL 2021 : SRHకి భారీ షాక్..మిగతా సీజన్ కు కేన్ మామతో పాటు ఆ స్టార్ ప్లేయర్ కూడా దూరం..!

IPL 2021 : ఐపీఎల్ వాయిదా వేసే టైంకి పాయింట్స్ టేబుల్ లో ఆఖరి స్థానంలో నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఒక వేళ తిరిగి ఐపీఎల్ మిగతా సీజన్ ప్రారంభమైతే.. పాయింట్స్ టేబుల్ లో పుంజుకోవాలంటే సన్ రైజర్స్ అద్భుతం చేయాల్సి ఉంది. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో షాక్ తగలనుంది.

  • Share this:
    సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021కి కరోనా బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ జట్లలో కరోనా కేసులు వెలుగు చూడటంతో ఈ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. అయితే, వాయిదా వేసే టైంకి పాయింట్స్ టేబుల్ లో ఆఖరి స్థానంలో నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఒక వేళ తిరిగి ఐపీఎల్ మిగతా సీజన్ ప్రారంభమైతే.. పాయింట్స్ టేబుల్ లో పుంజుకోవాలంటే సన్ రైజర్స్ అద్భుతం చేయాల్సి ఉంది. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో షాక్ తగలనుంది. కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మిగతా సీజన్‌కు ఆ జట్టు కెప్టెన్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌ దూరమయ్యే అవకాశం ఉంది. కేన్ విలియమ్సన్ తో పాటు బెయిర్ స్టోకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. విలియమ్సన్ ఒక్కడే కాకుండా న్యూజిలాండ్ ఆటగాళ్లంతా ఈ క్యాష్ రిచ్ లీగ్ సెకండ్ ఫేజ్‌‌కు దూరం కానున్నారు. అదే జరిగితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ముంబై ఇండియాన్స్, ఆర్‌సీబీ‌లకు కోలుకోలేని దెబ్బ తగలనుంది. సెప్టెంబర్‌లో న్యూజిలాండ్ యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో ఆడనుంది. దీంతో ఐపీఎల్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (ఎస్ఆర్‌హెట్), కైల్ జెమీసన్(ఆర్‌సీబీ), జిమ్మీ నీషమ్(ముంబై ఇండియన్స్), లాకీ ఫెర్గూసన్(కేకేఆర్), ఫిన్ అలెన్(ఆర్‌సీబీ), మిచెల్ సాంట్నర్(ఆర్‌సీబీ), టిమ్ సీఫెర్ట్(కేకేఆర్) ఐపీఎల్ సెకండాఫ్‌కు దూరం కానున్నారు.

    లీగ్ వాయిదా పడేముందే కేన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇవ్వగా.. కైల్ జెమీసన్ రూ.15 కోట్ల భారీ ధరకు ఆర్‌సీబీ తీసుకుంది. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడే సమయానికి రిషభ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో టాప్‌లో ఉంది. ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది. ఇక కేన్ విలియమ్సన్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అట్టడుగున నిలిచింది. 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయాన్నందుకుంది.

    మరోవైపు, ఐపీఎల్ 2021 సీజన్‌ను ఎప్పుడు రీషెడ్యూల్ చేసినా ఇంగ్లండ్ ప్లేయర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదని ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ యాష్లే జైల్స్ తెలిపాడు. ఇంగ్లండ్ టీమ్‌కు ఉన్న బిజీ షెడ్యూలే ఇందుకు కారణమన్నాడు. ఈ దెబ్బతో బెయిర్ స్టో కూడా జట్టుకు దూరం కానున్నాడు. బెయిర్ స్టో తో పాటు జాసన్ రాయ్ కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో సన్ రైజర్స్ కి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం.ఐపీఎల్ 2021లో 29 మ్యాచులు ముగిశాక కోల్‌కతా ప్లేయర్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌.. ఢిల్లీ స్పిన్నర్ అమిత్‌ మిశ్రా.. హైదరాబాద్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా.. చెన్నై కో‌చ్‌లు లక్ష్మీపతి బాలాజీ, మైక్‌ హస్సీ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. అయితే మిగిలిన 31 మ్యాచులు నిర్వహించేందుకు సరైన సమయం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. టీ20 ప్రపంచకప్‌ ముందు సెప్టెంబర్‌, అక్టోబర్ మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు