• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 BCCI REMOVES SOFT SIGNALS FROM IPL 14TH SEASON SU

IPL 2021: ఈ ఏడాది ఐపీఎల్ రూల్స్‌లో కీలక మార్పులు.. కోహ్లి అభ్యర్థనపై బీసీసీఐ కీలక నిర్ణయం..

IPL 2021: ఈ ఏడాది ఐపీఎల్ రూల్స్‌లో కీలక మార్పులు.. కోహ్లి అభ్యర్థనపై బీసీసీఐ కీలక నిర్ణయం..

విరాట్ కోహ్లి(ఫైల్ ఫొటో)

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యర్థనను పరిగణలోకి తీసుకన్న బీసీసీఐ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో సాఫ్ట్ సిగ్నల్‌ను రద్దు చేసింది.

  • Last Updated:
  • Share this:
    పఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2021 సీజన్‌‌కు సంబంధించి BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌కు ఫీల్డ్‌ అంపైర్‌ ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ రద్దు చేసింది. అలాగే షార్ట్ రన్‌ను రివ్యూ చేసే అధికారాన్ని కూడా థర్డ్ అంపైర్‌కు అప్పజెప్పింది. ఈ మేరకు ఐపీఎల్ ప్లేయింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. సాధారణంగా ఏదైనా ఔట్ విషయంలో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసినప్పుడు ఫీల్డ్ అంపైర్ చెప్పే అభిప్రాయాన్ని సాఫ్ట్ సిగ్నల్ అంటారు. అయితే కొన్నిసార్లు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ వివాదాలకు కారణమవుతుంది. వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల టీమిండియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌పై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయంపై ఆధారపడకుండా.. థర్డ్ అంపైర్ తనకు రిఫర్ చేసిన అంశాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా బీసీసీఐ ఈ ఐపీఎల్ సీజన్‌లో సాఫ్ట్ సిగ్నల్ విధానాన్ని తొలగించింది.

    ఇక, టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా సాఫ్ట్‌ సిగ్నల్‌ ఔట్‌ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ క్యాచ్‌ను డేవిడ్‌ మలన్‌ సరిగా అందుకున్నాడా లేదా అనేదానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే మైదానంలోని అంపైర్ జౌటని సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో థర్డ్ ఎంపైర్ కూడా సూర్యకుమార్‌ను ఔట్ అని ప్రకటించాడు. అయితే మలన్ క్యాచ్ పట్టిన తర్వాత అతను పట్టిన బంతి గ్రౌండ్‌ను తాకినట్లు రిప్లైలో స్పష్టంగా కనిపించింది.

    ఈ నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ వివాదస్పదంగా మారింది. ఈ విధానంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విధానాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నాడు. పలువురు మాజీ క్రికెటర్లు ఈ విధానంపై తీవ్రంగా స్పందించారు. ఈ విధానాన్ని తొలగించాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కోహ్లి మాటలను పరిగణలోకి తీసుకోవడంతోపాటు, ఈ ఐపీఎల్ సాఫ్ట్ సిగ్నల్ విధానం కారణంగా వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

    ఇక, పరుగులు తీసే క్రమంలో బ్యాట్స్‌మెన్ క్రీజును టచ్ చేయకుండా వెళితే.. దాన్ని షార్ట్ రన్‌గా పరిగణిస్తారు. ఆ పరుగును స్కోర్‌లో నుంచి తీసేశారు. అయితే దీనిని ఫీల్డ్ అంపైర్లు గుర్తించాల్సి ఉంది. అయితే చాలా సార్లు ఈ విషయంలో తప్పిదాలు జరగడంతో.. షార్ట్ రన్‌పై ఫీల్డ్ అంపైర్ తీసుకునే నిర్ణయాన్ని రివ్యూ చేసే అధికారాన్ని కూడా థర్డ్ అంపైర్‌కు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.  ఇక, గత ఐపీఎల్ సీజన్‌లో షార్ట్ రన్ విషయంలో అంపైర్ చేసిన తప్పిదం కారణంగా పంజాబ్ జట్టు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర వివాదస్పదంగా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు