హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : వాటే ఫీల్డింగ్.. వాటే ఫీల్డింగ్..! అందుకే కదా ఐపీఎల్ సూపర్ హిట్.. (వైరల్ వీడియో)

IPL 2021 : వాటే ఫీల్డింగ్.. వాటే ఫీల్డింగ్..! అందుకే కదా ఐపీఎల్ సూపర్ హిట్.. (వైరల్ వీడియో)

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IPL 2021 : క్రికెట్ (Cricket Latest Telugu News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది.

  క్రికెట్ (Cricket Latest Telugu News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాసాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయ్. ఇక, ఐపీఎల్ (IPL) లో సూపర్ మూమెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు ప్రతి మ్యాచ్ లోనూ మనం చూస్తూనే ఉంటాయ్. ఇక, ఇలాంటి విన్యాసమే లేటెస్ట్ గా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RR Vs RCB) మ్యాచ్ లో జరిగింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. సూపర్ మ్యాన్‌లా తన ఫీల్డింగ్ ఫీట్‌తో ఔరా అనిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో పరాజయం పాలైన విషయం తెలిసిందే.

  అయితే రాజస్థాన్ ఓడినా ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన అతను బౌండరీ లైన్ వద్ద తన మైమరిపించే ఫీల్డింగ్‌తో సిక్స్‌ను కాస్త సింగిల్‌గా మార్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ముస్తాఫిజుర్ సూపర్ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వాటే ఫీల్డింగ్.. వాటే ఫిట్‌నెస్ అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

  ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో కార్తీక్ త్యాగీ వేసిన 5వ బంతిని గ్లేన్ మ్యాక్స్‌వెల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫైన్ లెగ్ దిశగా సిక్సర్‌గా దూసుకెళ్లింది. దాదాపు సిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ గాల్లో సూపర్ మ్యాన్‌లా లేచిన ముస్తాఫిజుర్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. చేతికి చిక్కకపోవడంతో చాకచక్యంగా మైదానంలోకి నెట్టేసాడు. ఇక సిక్స్ పక్కా అనుకున్న మ్యాక్సీ.. పరుగులు తీయకుండా లైట్ తీసుకున్నాడు. దీంతో సిక్స్ కాస్త సింగిల్‌గా మారింది.

  ఇక, మ్యాచ్ విషయాన్నికొస్తే గ్లేన్ మ్యాక్స్‌వెల్( 30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి శ్రీకర్ భరత్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 44) క్లాస్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ అద్భుత విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 రన్స్ చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), యశస్వీ జైస్వాల్(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) మినహా అంతా విఫలమయ్యారు.

  ఇది కూాడా చదవండి : బూతులు తిట్టడంటూ బీసీసీఐకి కోహ్లీపై ఫిర్యాదు చేసింది ఆ సీనియర్ ప్లేయరే..! ఎవరంటే..

  ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఆర్సీబీ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. దీంతో మొత్తం 14 పాయింట్లు ఆర్సీబీ సాధించింది. ఈ మ్యాచ్‌లో మరో 17 బంతులు ఉండగానే లక్ష్యం ఛేదించడంతో నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపరుచుకున్నది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు రెండో దశలో ఇది వరుసగా మూడో ఓటమి. దీంతో ప్లే ఆఫ్ ఆశలు మరింత క్లిష్టతరం చేసుకుంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Glenn Maxwell, IPL 2021, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sports, Virat kohli

  ఉత్తమ కథలు