• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 AUCTION TO BE HELD ON 18TH FEBRUARY IN CHENNAI SA

IPL 2020: చెన్నై వేదికగా ఐపీఎల్ వేలం.. టోర్నీ ఎప్పుడంటే!

IPL 2020: చెన్నై వేదికగా ఐపీఎల్ వేలం.. టోర్నీ ఎప్పుడంటే!

IPL auction

ఐపీఎల్ 2021 సీజన్‌కు సన్నహాలు అప్పుడే మెుదలయ్యాయి. ఐపీఎల్ ప్లేయర్స్ వేలం ఫిబ్రవరి 18 న చెన్నై వేదికగా జరుగునుంది. ఈ విషయాన్ని ఐపిఎల్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్‌కు సన్నహాలు అప్పుడే మెుదలయ్యాయి. ఐపీఎల్ ప్లేయర్స్ వేలం ఫిబ్రవరి 18 న చెన్నై వేదికగా జరుగునుంది. ఈ విషయాన్ని ఐపిఎల్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. IPL 2021 సీజన్ మినీ వేలం కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు ఆటగాళ్ల రిటైన్/ రిలీజ్ ప్రక్రియను పూర్తి చేశాయ్.





    ఈ ప్రక్రియలో 8 జట్లు 140 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంటే..57 మంది ప్లేయర్స్ ను రిలీజ్ చేశాయ్. అలాగే ఐపీఎల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లు ఫిబ్రవరి 2 లోగా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎక్కువ మంది ప్లేయర్స్ ను కలిగి ఉంది. ఇక తమ దగ్గర ఉన్న మొత్తంతో ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొనున్నాయ్ జట్లు. దీంతో స్టార్ ప్లేయర్స్ పై అన్ని ఫ్రాంచైజీల కన్ను పడింది. మార్చి 25 నుంచి ఐపీఎల్ ప్రారంభమయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేలంతో ఇండియాలో క్రికెట్ సన్నహాలు ఊపందుకొనున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020 ఎడిషన్ సెప్టెంబర్-నవంబర్‌లో యుఎఇలో జరిగిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ పర్యటనతో భారత్‌తో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.

    ఏయే జట్టు దగ్గర ఎంత డబ్బు ఉందో ఒకసారి లుక్కేద్దాం.

    రాజస్థాన్ రాయల్స్ : 34.85 కోట్ల రూపాయలు

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ .35.70 కోట్లు

    చెన్నై సూపర్ కింగ్స్: రూ. 22.90 కోట్లు

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రూ .53.2 కోట్లు

    ముంబై ఇండియన్స్: రూ. 15.35 కోట్లు

    ఢిల్లీ క్యాపిటల్స్ : రూ. 12.80 కోట్లు

    కోల్‌కతా నైట్ రైడర్స్: రూ .10.85 కోట్లు

    సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ .10.75 కోట్లు
    Published by:Rekulapally Saichand
    First published: