ఐపీఎల్ 2021 సన్నహాలు అప్పుడే మొదలయ్యాయి. త్వరలో వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు జట్టు నుంచి ఆటగాళ్ళును రీలిజ్ చెసింది.
పిభ్రవరి చివరి వారంలో వేలం జరిగే అవకాశం ఉన్నందున జట్లు అందుకోసం కసరత్తు మెుదలుపెట్టాయి. అయితే ఆక్షన్‌లో ఎవరూ ఎంత ధర పలుకుతారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఐపీఎల్లో అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నిలుస్తాడని తెలిపారు. జనవరి 20 లోగా ప్రాంఛైజీలు వదిలేయాలి అనుకున్న ఆటగాళ్ళ జాబితాను సిద్దం చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో బుధవారం జట్లు ఆ లిస్ట్‌ను వెల్లడించిన సంగతి తెలిసిందే. తర్వలో మీని బోర్డు మీని వేలాన్ని నిర్వహించనుంది. దీంతో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ ట్విటర్లో పలువురు ఆటగాళ్ల ధరలను అంచనా వేశాడు.
పంజాబ్ నుంచి రీలీజైనా ముజీబుర్ రెహ్మాన్ అత్యధికంగా రూ.7-8 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉండని తెలిపారు. అలాగే కోల్‌కతా నుంచి విడుదలైనా క్రిస్‌గ్రీన్ ధర రూ.5-6 కోట్లు ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చెశారు. ఇక ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వేలంలో అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా నిలుస్తాడని అంచనావేశారు. అయితే అతని ధర మాత్రం అంచనా వేయలేకపోయారు.
ఇక దిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటకు వచ్చిన జేసన్ రాయ్ రూ.4-6 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉండన్నారు. మాక్స్వెల్, నాథన్ కౌల్టర్ నైల్ కూడా మంచి ధర పలుకుతారని వివరించాడు. ఇవన్ని కేవలం అంచనా మాత్రమే అని ఆటగాళ్ళు కొనుగొలు విషయంలో ప్రాంఛైజీలు అనుసరించే
విధానం మరోలా ఉండోచ్చని అంచనా వేశారు.
Published by:Rekulapally Saichand
First published:January 21, 2021, 13:45 IST