IPL 2020: మహిళా ఐపీఎల్ చాలెంజర్ సిరీస్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్...నవంబర్ లో నిర్వహించే చాన్స్...

ఉమెన్స్ ఛాలెంజర్ సిరీస్ నవంబర్ 1 నుండి 10 వరకు నిర్వహించడానికి ప్రణాళిక చేశామని అయితే దానికి ముందు శిబిరాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ సిరీస్ కూడా యూఏఈలోనే జరిగే అవకాశం ఉందని సూత్రప్రాయంగా గంగూలీ తెలిపారు.

news18-telugu
Updated: August 2, 2020, 7:58 PM IST
IPL 2020: మహిళా ఐపీఎల్ చాలెంజర్ సిరీస్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్...నవంబర్ లో నిర్వహించే చాన్స్...
గంగూలీ(File)
  • Share this:
మహిళా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ను నిర్వహించడానికి పూర్తి ప్రణాళిక ఉందని క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆదివారం అన్నారు. పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా, ఇప్పటికే పురుషుల ఐపిఎల్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 మధ్య యుఎఇలో జరగాల్సి ఉంది (చివరి తేదీ ఇంకా నిర్ణయించలేదు). అయితే పురుషుల ఐపీఎల్ తో పాటు ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహణకు ప్రణాళిక ఉందని బీసీసీఐ చీఫ్ గంగూలీ తెలిపారు.

గంగూలీ మహిళల ఐపిఎల్ గురించి పూర్తి సమాచారం ఇవ్వలేదు, అయితే ఈ విషయంపై అవగాహన ఉన్న మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఐపిఎల్ చివరి దశలో మహిళా ఛాలెంజర్ ట్రోఫీ జరుగుతుందని చెప్పారు. ఉమెన్స్ ఛాలెంజర్ సిరీస్ నవంబర్ 1 నుండి 10 వరకు నిర్వహించడానికి ప్రణాళిక చేశామని అయితే దానికి ముందు శిబిరాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ సిరీస్ కూడా యూఏఈలోనే జరిగే అవకాశం ఉందని సూత్రప్రాయంగా గంగూలీ తెలిపారు.

దేశంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రస్తుతం వాయిదా పడుతున్న సెంట్రల్ కాంట్రాక్టు మహిళా క్రీడాకారుల కోసం ఒక శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు భారత మాజీ కెప్టెన్ తెలిపారు. కోవిడ్ -19 కారణంగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) కూడా మూసివేశారు. కానీ ప్రస్తుతం మహిళా జట్టు కోసం తమ వద్ద ఒక ప్రణాళిక ఉందని తెలిపారు. న్యూజిలాండ్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌పై రెండు పూర్తి ఓవర్ల పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి భారత మహిళా జట్టుకు అవకాశం లభిస్తుంది.
Published by: Krishna Adithya
First published: August 2, 2020, 7:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading