క్రీడలు

  • associate partner

IPL 2020: ఐపీఎల్ తేదీలు ఖరారు.. 51 రోజులు ఫ్యాన్స్‌కు పండగే

వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై తుది షెడ్యూల్‌కు ఆమోద ముద్రవేయనుంది. ఆ తర్వాత షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటిస్తారు.

news18-telugu
Updated: July 24, 2020, 8:05 AM IST
IPL 2020: ఐపీఎల్ తేదీలు ఖరారు.. 51 రోజులు ఫ్యాన్స్‌కు పండగే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐపీఎల్ కోసం క్రికెట్ ఆతురతగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ సందడి ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా.. అని వెయిట్ చేస్తున్నారు. ఐతే అక్టోబర్-నవంబరులో జరగాల్సిన టీ2 వరల్డ్ కప్ వాయిదా పడడంతో ఐపీఎల్‌కు లైన్ క్లియరైంది. యూఏఈ వేదికగా పొట్టి క్రికెట్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఐతే ఐపీఎల్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని రోజులు ఉంటుంది? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనిపై బీసీసీఐ ప్రస్తుతానికి అధికారిక ప్రకటన చేయనకున్నప్పటికీ.. తేదీలను మాత్రం ఖరారు చేసినట్లు సమాచారం.

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ టోర్నీ జరుగుతుందని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లుగా PTI వార్తా సంస్థ పేర్కొంది. ఈ వివరాల ప్రకారం.. నవంబరు 8న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 51 రోజుల పాటు ఈ మెగా టోర్నీ సందడి చేయబోతోంది. వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై తుది షెడ్యూల్‌కు ఆమోద ముద్రవేయనుంది. ఆ తర్వాత షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటిస్తారు.

వాస్తానికి మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ మెగా క్రికెట్ టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. ప్రస్తుతం కరోనా విజృంభణ పతాక స్థాయికి చేరి నేపథ్యంలో యూఏఈలో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించింది.

ఐతే గతంలో పలుమార్లు విదేశాల్లో ఐపీఎల్ టోర్నీ నిర్వహించారు. 2009 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను సౌతాఫ్రికాలో నిర్వహించారు. ఆ తర్వాత ఎలక్షన్స్ ముగిశాక తిరిగి స్వదేశానికి తరలించారు. అటు 2014 ఎన్నికలప్పుడు కూడా కొన్ని మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించారు. ఐతే 2019లో ఎన్నికలు ఉన్నప్పటికీ.. భారత్‌లోనే ఐపీఎల్ టోర్నీ జరిగింది. ఎన్నికల తేదీలు, మ్యాచ్‌లు ఒకేసారి ఉండకుండా.. చర్యలు తీసుకున్నారు. ఈసారి కరోనా నేపథ్యలో మరోసారి విదేశాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 24, 2020, 8:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading