క్రీడలు

  • associate partner

IPL 2020: స్టార్ స్ట్పోర్ట్స్‌ను పట్టించుకొని బీసీసీఐ.. వారం ముందుగానే షెడ్యూల్

యుఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. దాదాపు 51 రోజుల పాటు ఈవెంట్ జరగనుంది. నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.

Rekulapally Saichand
Updated: July 24, 2020, 11:25 AM IST
IPL 2020: స్టార్ స్ట్పోర్ట్స్‌ను పట్టించుకొని బీసీసీఐ.. వారం ముందుగానే షెడ్యూల్
bcci vs star sports
  • Share this:


ఇండియన్ ప్రీమియర్ లీగ్ తేదీలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. యుఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. దాదాపు 51 రోజుల పాటు ఈవెంట్ జరగనుంది. నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఆగస్టు 20 లోపు అన్ని జట్లను యుఏఈ తరిలించనున్నారు. ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఇప్పటీకే షెడ్యూల్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలకు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. దీపావళి రోజైన 14వ తేదీన ఫైనల్  ఉంటే బాగుంటుందని స్టార్ స్ట్పోర్ట్ భావించినప్పటికి బీసీసీఐ  అవేమి  పట్టించుకోకుండా నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్  నిర్ణయించింది.

సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్ నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటీకి డిసెంబర్‌లో భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటన ఉండడంతో  వారం రోజుల ముందుగానే ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోంది. లీగ్ తర్వాత ఐసీసీ నిబంధనాల ప్రకారం భారత జట్టుకు 14 రోజుల క్వారెంటెన్ ఉంటుంది. డిసెంబర్ చివరలో ఇండియా, అస్ట్రేలియా మధ్య సిరీస్ జరగనుంది.

అలాగే వివిధ దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఐపీఎల్ ఆడేందుకు ఆటగాళ్ళకు అనుమతిని ఇచ్చాయి. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఒక్క అడుగు ముందుకు వేసి ఐపీఎల్‌లో పాల్గొనాల్సిన తమ ఆటగాళ్లందరికీ నిరభ్యంతరకర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేస్తామని ప్రకటించింది. కానీ ఆటగాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో మాత్రం వారిదే బాధ్యత అని తెలిపింది.
Published by: Rekulapally Saichand
First published: July 24, 2020, 10:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading