Home /News /sports /

IPL 2020 ROHIT SHARMA HITS A MOVING BUS AS HE CLEARS STADIUM WITH HUGE SIX WATCH BA

IPL 2020: నెట్ ప్రాక్టీస్‌లోనే బస్సులు పగలగొడుతున్న రోహిత్ శర్మ, వీడియో

రోహిత్ శర్మ (File; Image/Twitter)

రోహిత్ శర్మ (File; Image/Twitter)

IPL 2020 Matches Schedule: సెప్టెంబర్ 19 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

    Rohit Sharma: రోహిత్ శర్మ. క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు హిట్ మ్యాన్. క్రీజ్‌లో నిలదొక్కుకుంటే అవతల బౌలర్ ఎవరనేది కూడా చూడకుండా బీభత్సంగా బాదేస్తాడు. అయితే, నెట్ ప్రాక్టీస్‌లో కూడా ప్రస్తుతం అలాగే కొడుతున్నాడీ ముంబై ఇండియన్స్ కెప్టెన్. ఐపీఎల్ 2020 సీజన్ 13 ప్రస్తుతం యూఏఈలో జరగనుంది. దీని కోసం జట్లు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు రాత్రి కూడా నెట్ ప్రాక్టీస్‌లో మునిగింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా, బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నారు. అయితే, బౌలర్ వేసిన ఓ బంతిని రోహిత్ శర్మ బలంగా బాదాడు. దీంతో ఆ బాల్ వెళ్లి పిచ్ బయట వెళ్తున్న బస్సు మీద పడింది. ఈ సూపర్ హిట్ సీన్‌ని ముంబై ఇండియన్స్ జట్టు తమ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘బ్యాట్స్‌మెన్ సిక్స్‌లు కొడతారు. లెజెండ్స్ స్టేడియం క్లియర్ చేస్తారు. హిట్ మ్యాన్ సిక్స్ కొట్టి స్టేడియం క్లియర్ చేసి కదిలే బస్సును కూడా కొడతాడు.’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.




    ఐపీఎల్ 2020 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 19 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని బీసీసీఐ తెలిపింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Cricket, IPL 2020, Mumbai Indians, Rohit sharma, UAE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు