IPL 2020 Points Table: ఐపీఎల్‌లో ముగిసిన 12 మ్యాచ్‌లు..పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఎక్కడ?

ఐపీఎల్ ట్రోఫీ

IPL 2020 Points Table Updated: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 12 మ్యాచ్‌లు ముగిశాయి. బుధవారం రాత్రి జరిగిన 12వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)పై కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల తర్వాత ప్రస్తుతం పాయింట్ టేబుల్‌లో ఏ జట్టు ఏ స్థానంలో ఉందో చెక్ చేసుకోండి. అలాగే ఆరంజ్ క్యాప్, పర్పిల్ క్యాప్ లిస్ట్‌లో ఏ ఆటగాళ్లు అగ్రస్థానంలో ఉన్నారో చూడండి.

  • Share this:
    IPL 2020 Points Table Updated: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో 12 మ్యాచ్‌లు ముగిశాయి. బుధవారం రాత్రి జరిగిన 12వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)పై కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. గతంలో రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ బుధవారం నాటి మ్యాచ్‌కి ముందు చివరి నుంచి రెండో స్థానం(7వ స్థానం)లో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్న కేకేఆర్..4 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఆ జట్టు నెట్ రన్ రేట్(NRR) 0.117గా ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్..రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా..ఒక మ్యాచ్‌లో ఓటమి చెవిచూసింది. ఐపీఎల్‌లో తొలి ఓటమి చెవిచూసిన రాజస్థాన్ రాయల్స్..4 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో ప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా..ఓ మ్యాచ్‌లో పరాజయంపాలయ్యింది.

    పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు కూడా నాలుగు పాయింట్లు సాధించగా...నెట్ రన్ రేట్ మాత్రం కోల్‌కతా కంటే మెరుగ్గా 0.483 ఉంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగేసి పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK) పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో సీఎస్కే రెండుమ్యాచ్‌లలో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.



    Orange Cap(Most Runs)
    అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్లకు సంబంధించిన ఆరంజ్ క్యాప్ పట్టికలో కేఎల్ రాహుల్(కింగ్స్ ఎలెవన్ పంజాబ్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లీగ్‌లో ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ మొత్తం 222 పరుగులు సాధించాడు. ఒక్క పరుగు తక్కువ(221)తో మయాంక అగర్వాల్(కింగ్స్ ఎలెవన్ పంజాబ్) రెండో స్థానంలో నిలవగా...సీఎస్కే ఆటగాడు డూప్లెసిస్(173), రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు శాంసన్(159), ఆర్సీబీ ఆటగాడు ఏబీ డీవిల్లియర్స్(134) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.



    Purple Cap(Most Wickets):
    అలాగే అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లకు సంబంధించి పర్పుల్ క్యాప్ పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ రబడా 7 వికెట్ల(12 ఓవర్లు)తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మొహమ్మద్ షమి(7 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. తలా ఐదేసి వికెట్లతో శాం కురాన్ (CSK), ఛాహల్(RCB), ట్రెంట్ బౌల్స్(MI) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తున్నారు.



    సోమవారంనాటి మ్యాచ్‌లో ఆర్సీబీపై రెండు వికెట్లు సాధించిన ముంబై ఇండియన్స్ ఫేసర్ ట్రెంట్ బౌల్ట్ ఐదో స్థానానికి ఎగబాకాడు.

    IPL Time Table:
    ఇక ఐపీఎల్‌లో జరగనున్న తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఇక్కడ చెక్ చేసుకోండి.



    అక్టోబర్ 1(గురువారం)నాడు అబుదాబిలోని షేక్ సయ్యిద్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ముంబై ఇండియన్స్ జట్టు ఢీకొనుంది.
    Published by:Janardhan V
    First published: