ధోనీ సిక్సర్ ప్రేరణ.. నిర్వచించలేని ఆ అభిమాని సేవ

అభిమానం హద్దులు దాటకూడదు. అభిమానించే వ్యక్తి ఉన్నత విలువలతో అందరికి స్పూర్తిగా నిలుస్తున్నప్పుడు.. అభిమానగణం కూడా అదే దారిలో నడవాలి

news18-telugu
Updated: October 20, 2020, 10:21 PM IST
ధోనీ  సిక్సర్ ప్రేరణ.. నిర్వచించలేని ఆ అభిమాని సేవ
అభిమానం హద్దులు దాటకూడదు. అభిమానించే వ్యక్తి ఉన్నత విలువలతో అందరికి స్పూర్తిగా నిలుస్తున్నప్పుడు.. అభిమానగణం కూడా అదే దారిలో నడవాలి
  • Share this:
అభిమానం హద్దులు దాటకూడదు. అభిమానించే వ్యక్తి ఉన్నత విలువలతో అందరికి స్పూర్తిగా నిలుస్తున్నప్పుడు.. అభిమానగణం కూడా అదే దారిలో నడవాలి. వారు కీర్తిని మరింతగా పెంచేలా పలువురు చేత శభాష్ అనిపించుకునేలే సనులు చేయడమే అసలైన అభిమానులు చేసే పని. తాజాగా టీమిండియా మాజీ సారథి ఎమ్ఎస్ ధోనీ  తంగరాజ్‌‌చేసి ఇతరులకు అదర్శంగా నిలిచాడు.తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన నెయ్‌కరపట్టి గ్రామం చెందిన తంగరాజ్‌‌ అనే యువకుడు ధోనీ అభిమాని.  2011 ప్రపంచకప్‌లో ధోనీ కొట్టిన సిక్సర్‌.. దాని వల్ల ప్రభావితుడైన తంగరాజ్‌‌.. జూలై 7న ఆ ఊరు జరుపుకునే ఓ పండుగ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడతున్నాడు.  అయితే ఆ రోజు మహేంద్రసింగ్‌ ధోనీ జన్మదినం కూడా. ఆ రోజు ఆ గ్రామంలో రెట్టింపు ఉత్సాహంతో పండుగ జరుపుకుంటారు. 2011లో నెయ్‌కరపట్టి గ్రామంలో ‘తాలామయి ధోనీ రసిఘర్‌ మంద్రమ్‌’ పేరుతో ధోనీ ఫ్యాన్స్ క్లబ్‌ను ఏర్పాటు చేసిన తంగరాజ్‌ ఆ క్లబ్ ద్వారా అనేక సేవలు చేస్తున్నాడు . ‌పేదలకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తూ రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్షబ్‌లో  60మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారందరి సహకారంతో సేవలు కార్యక్రమాలు చేస్తున్నారు  చెన్నై జట్టు కూడా ఈ ఫ్యాన్‌ క్లబ్‌ గురించి ట్విటర్‌ వేదికగా పలు పోస్టులు చేసింది.
ఈ కార్యక్రమాలపై స్పందించిన  తంగరాజ్‌ ఒకసారి ధోనీని కలుసుకున్నాను.. ఆ అనుభూతి వర్ణించలేనిది. 2017లో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనా ధోనీ కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకున్నాను. అతను అలా చేయవద్దని పైకి లేపాడు’’ ధోనీని కలుసుకున్న సమయంలో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
Published by: Rekulapally Saichand
First published: October 20, 2020, 10:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading