ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ త్వరలో తీసి కబురు అందించనున్నది. ఐపీఎల్ 2020 ఎడిషన్ విదేశాల్లో నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. దుబాయ్ లేదా శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తోంది. టీ20 ప్రపంచకప్‌పై నిర్ణయం కోసం బీసీసీఐఎదురుచుస్తోంది. వర్డల్ కప్ తేదీలను బట్టి వేదికను నిర్ణయించనున్నారు. అయితే టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడే సూచనలే కనిపిస్తున్నాయి
ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా రక్కసి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. విదేశాల్లో కాకుండా భారత్‌లోనే లీగ్‌ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. భారత్‌లో కరోనా మహామ్మారి విజృభణ ఈ విధంగానే కొనసాగితే టోర్నీని యూఏఈ లేదా శ్రీలంకకు తరిలించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అలోస్తోంది.
ముంబాయిలో ఐపీఎల్ మెుత్తాన్ని నిర్వహిస్తారనే వార్తలు వచ్చిన సంగతి తేలిసిందే. వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్, రిలయన్స్ స్టేడియాలలో మ్యాచ్‌లు జరుగుతాయనే ప్రచారంపై బీసీసీఐ అధికారి ఒక్కరు స్పందించారు. "వేదికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశాల్లో ఐపీఎల్ జరిగే అవకాశమైతే ఉంది. ఒక్కటి,రెండు మైదానాలలో ఐపీఎల్ ఆడడం చాలా కష్టం. ముఖ్యంగా ఆటగాళ్ళకు సురిక్షితమైన వాతావరణం కల్పించాలి.దుబాయ్, శ్రీలంక ఐపీఎల్‌కు అతిథ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. అక్కడ పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు" ఆ అధికారి తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.