Rekulapally SaichandRekulapally Saichand
Updated: July 21, 2020, 5:27 PM IST
bcci vs star sports
అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌కు సన్నహాలు మెుదలయ్యాయి. ఈవెంట్ నిర్వహించాలని గట్టిపట్టుదలతో ఉన్న బీసీసీఐ మ్యాచ్ నిర్వహణకోసం ప్రణాళికలు రచిస్తో్ంది. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు షెడ్యూల్‌ను కూడా రూపొందించినట్టు తెలుస్తోంది. బోర్డు అంతర్గత సమాచారం ప్రకారం యూఏఈ వేదికగా 44 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ సిద్దంచేస్తుందంట.
అయితే షెడ్యూలపై బోర్డులోని కొందరు సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈవెంట్ ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్‌స్పోర్ట్స్ అసంతృప్తితో ఉంది. బీసీసీఐ అంతర్గత షెడ్యూల్ ప్రకారం నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ ఉంటుందని నిర్ణయించింది. కానీ ఆ మ్యాచ్ దీపావళి రోజైన 14వ తేదీన ఉంటే బాగుంటుందని స్టార్ స్ట్పోర్ట్ భావిస్తోంది. దీపావళీ సీజన్ చివరకు ఐపీఎల్ ఉంటే ప్రకటనల రూపేణ ఛానల్‌కు ఎక్కువ మెుత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉండదు. దీంతో దీవాళీ చివరకు ఈవెంట్ ఉండాలని స్టార్‌స్పోర్ట్స్ కోరుతోందని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
దీపావళీ వారంతంలో టోర్నీ ఉంటే వీక్షకుల సంఖ్య తక్కువ ఉంటుందని, ఈ విషయం గతంలోని బార్క్ రేటింగ్స్‌లో రుజువైందని స్టార్ స్పోర్ట్స్.. బీసీసీఐకి వివారించింది. కాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి మరో వాదన వినిపిస్తోంది. ఐపీఎల్ తర్వాత ఆటగాళ్ళు క్వారంటైన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కవేళ 14న ఫైనల్ జరిగితే క్వారంటైన్ టైం పెరిగి డిసెంబరు 3న ప్రారంభమైయే భారత్ - ఆస్ట్రేలియా సిరీస్‌కు అటంకం కలుగుతుందని బీసీసీఐ అంటుంది. ఇనాళ్ళు కరోనా, టీ20 వరల్డ్ కప్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఐసీఎల్‌కు ఇప్పటికైనా సజువుగా జరుగుతుందని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు తాజా వివాదం అభిమానులు నిరాశకు గురుచేస్తోంది.
Published by:
Rekulapally Saichand
First published:
July 21, 2020, 5:15 PM IST