IPL 2020 : ఐపీఎల్‌ వేలం షురూ...మన ఆటగాళ్లు మరీ అంత చీప్ అయిపోయారా...

మొత్తం 332 మంది క్రికెటర్లు ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం పోటీపడనున్నారు. అత్యధిక రిజర్వ్ ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించగా. ఈ కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేరు.

news18-telugu
Updated: December 13, 2019, 9:51 PM IST
IPL 2020 : ఐపీఎల్‌ వేలం షురూ...మన ఆటగాళ్లు మరీ అంత చీప్ అయిపోయారా...
ప్రతీకాత్మక చిత్రం (Image:IPL/Twitter)
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ కోసం వేలం పాటలో 332 మంది ఆటగాళ్లతో బీసీసీఐ తుది జాబితా విడుదల చేసింది. ఐపీఎల్ వేలానికి రికార్డు స్థాయిలో మొత్తం 971 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వేలం పాట కోల్‌కతా వేదికగా ఈనెల 19న జరగనుంది. మొత్తం 332 మంది క్రికెటర్లు ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం పోటీపడనున్నారు. అత్యధిక రిజర్వ్ ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించగా. ఈ కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేరు. భారత ప్లేయర్స్‌లో వస్తే రాబిన్ ఉతప్ప రూ.1.5 కోట్లు, జయదేవ్ ఉనద్కట్ రూ.1 కోటి రూపాయలు పలుకగా. మిగితా ప్లేయర్స్ సగానికి పైగా తక్కువ ధరకే వేలంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 186 మంది భారతీయులు, 143 మంది విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు 2020 ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సీజన్‌లో 8 జట్లతో పాటుగా మరో రెండు ఫ్రాంచైజీ జట్లు కూడా పోటీపడనున్నాయి. జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్, డేల్ స్టయిన్, మోర్గాన్, జాసన్ రాయ్, క్రిస్ లిన్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు మొదటి సెట్ వేలంలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు