లవ్ యూ లాలా.. యూసుఫ్ పఠాన్‌కు ఇర్ఫాన్ ఓదార్పు..

యూసుఫ్ పఠాన్‌తో పాటు దీపక్ హుడా,మార్టిన్ గుప్టిల్,రిక్కీ భుయ్‌లను కూడా సన్ రైజర్స్ వదులుకుంది.

news18-telugu
Updated: December 20, 2019, 12:19 PM IST
లవ్ యూ లాలా.. యూసుఫ్ పఠాన్‌కు ఇర్ఫాన్ ఓదార్పు..
ఇర్ఫాన్ పఠాన్,యూసుఫ్ పఠాన్ (File Photo)
  • Share this:
పించ్ హిట్టర్‌గా పేరున్న యూసుఫ్ పఠాన్‌ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.అయితే చాలాకాలంగా యూసుఫ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోతుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. యూసుఫ్ కనీస ధర రూ.1కోటి గానే నిర్ణయించినప్పటికీ.. ఏ జట్టు అతన్ని తీసుకోవడానికి ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌కు యూసుఫ్ దూరమైనట్టే. ఈ నేపథ్యంలో యూసుఫ్ సోదరుడు,బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. 'చిన్న చిన్న వెక్కిళ్లు నీ కెరీర్‌ను నిర్వచించలేవు.ఇన్నాళ్లు అద్భుతమైన క్రికెట్ ఆడావు. నువ్వో నిజమైన మ్యాచ్ విన్నర్. లవ్ యూ లాలా' అంటూ ఇర్ఫాన్ ట్విట్టర్‌లో స్పందించాడు. ఐపీఎల్‌లో అమ్ముడుపోకపోవడంతో ఒకింత బాధలో ఉన్న యూసుఫ్‌కి ఇర్ఫాన్ ఇలా ఓదార్పునిచ్చాడు.

కాగా,యూసుఫ్ పఠాన్‌తో పాటు దీపక్ హుడా,మార్టిన్ గుప్టిల్,రిక్కీ భుయ్‌లను కూడా సన్ రైజర్స్ వదులుకుంది. కొత్తగా 8 మంది ఆటగాళ్లను వేలంలో కొనుక్కున్న సన్‌రైజర్స్.. అందరికీ కలిపి కేవలం రూ.8కోట్లు మాత్రమే వెచ్చించడం గమనార్హం.


First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు