CSK vs DC: ఇమ్రాన్ తాహీర్, జడేజా మ్యాజిక్... చెన్నై చేతిలో ఢిల్లీ చిత్తు...

ఇమ్రాన్ తాహీర్‌కు 4 వికెట్లు... 3 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా... శ్రేయాస్ అయ్యర్ ఒంటరిపోరాటం... భారీ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లోకి చేరిన చెన్నై...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 8:37 AM IST
CSK vs DC: ఇమ్రాన్ తాహీర్, జడేజా మ్యాజిక్... చెన్నై చేతిలో ఢిల్లీ చిత్తు...
ఇమ్రాన్ తాహీర్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 8:37 AM IST
IPL 2019 Live Score, CSK vs DC Match at Chennai: 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.2 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇమ్రాన్ తాహీర్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పోరాడలేకపోయాడు. శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా రెండంకెల స్కోరు కూడా పెవిలియన్ చేరాడు. పృథ్వీషా 4, రిషబ్ పంత్ 5, ఇన్‌గ్రామ్ 1, అక్షర్ పటేల్ 9, రూథర్‌ఫర్డ్ 2, సుచిత్ 6, అమిత్ మిశ్రా 8 చేసి పెవిలియన్ చేరగా... క్రిస్ మోరిస్ డకౌట్ అయ్యాడు. 13 బంతుల్లో 19 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హర్భజన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కాగా, 31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌‌తో 44 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను జడేజా బౌలింగ్‌లో ధోనీ స్టంపౌట్ చేశాడు. 47 పరుగుల తేడాలో 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

అంతుకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగుల భారీ స్కోరు చేసింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో పరుగులు రాబట్టడానికి చెన్నై బ్యాట్స్‌మెన్ బాగా కష్టపడ్డారు. 3.2 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ దశలో 9 బంతులు ఆడి, పరుగులేమీ చేయలేకపోయిన షేన్ వాట్సన్...జగదీశ్ సుచిత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనాతో కలిసి డుప్లిసిస్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరూ పరుగులు సాధించడానికి కష్టపడడంతో రన్‌రేట్ నెమ్మదించింది. 14వ ఓవర్‌లో రన్‌రేట్ పెంచేందుకు భారీ సిక్సర్ సాధించిన డుప్లిసిస్... ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు డుప్లిసిస్. ఆ తర్వాత భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు సురేశ్ రైనా. జగదీశ్ సుచిత్ బౌలింగ్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన రైనా...తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి, ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 37 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్స్‌తో 59 పరుగులు చేశాడు సురేశ్ రైనా.

ఆ తర్వాత ధోనీ, జడేజా కలిసి వేగంగా పరుగులు రాబట్టారు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన జడేజా...క్రిస్‌మోరిస్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే అదే ఓవర్‌లో ఫోర్, సిక్సర్ బాది 18 పరుగులు రాబట్టారు అంబటి రాయుడు, ధోనీ. చివరి ఓవర్లో ఈ ఇద్దరూ ఏకంగా 21 పరుగులు రాబట్టడంతో 179 పరుగుల భారీ స్కోరు చేసింది చెన్నై. ధోనీ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు ధోనీ.

First published: May 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...