SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం... 6 వికెట్ల తేడాతో చెన్నై చిత్తు...

IPL 2019 Live Score, SRH vs CSK Match in Hyderabad: బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీలు... మరోసారి విఫలమైన మిడిల్ ఆర్డర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 18, 2019, 6:55 AM IST
SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం... 6 వికెట్ల తేడాతో చెన్నై చిత్తు...
IPL 2019 Live Score, SRH vs CSK Match in Hyderabad: బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీలు... మరోసారి విఫలమైన మిడిల్ ఆర్డర్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 18, 2019, 6:55 AM IST
IPL 2019 Live Score, SRH vs CSK Match in Hyderabad: వరుస పరాజయాలకు బ్రేక్ నిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో చెన్నైను చిత్తుగా ఓడించి, అద్భుత విజయం సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది హైదరాబాద్. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సొంతం చేసుకుంది. స్వల్ప లక్ష్యచేధనలో హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో అద్భుతంగా రాణించారు. డేవిడ్ వార్నర్ 25 బంతుల్లోనే 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, బెయిర్ స్టో 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొదటి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేన్ విలియంసన్ 3 పరుగులు, విజయ్ శంకర్ 7 పరుగులు, దీపక్ హుడా 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే ఇన్నింగ్స్ చివరి దాకా నిలిచిన బెయిర్ స్టో... సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్‌కు రెండు వికెట్లు దక్కగా, దీపక్ చాహార్, కర్న్ శర్మలకు చెరో వికెట్ దక్కాయి.


అంతకుముందు టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. కెప్టెన్ సురేశ్ రైనా నిర్ణయానికి న్యాయం చేస్తూ ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లిసస్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ కలిసి 9.5 ఓవర్లలో 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని నదీమ్ విడగొట్టాడు. 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన షేన్ వాట్సన్‌ను బౌల్డ్ చేసిన నదీమ్... సన్‌రైజర్స్‌కు తొలి వికెట్ అందచేశాడు. ఆ తర్వాత డుప్లిసిస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి విజయ్ శంకర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 13 పరుగులు చేసిన సురేశ్ రైనాను అవుట్ చేసిన రషీద్ ఖాన్, అదే ఓవర్‌లో కేదార్ జాదవ్‌(1పరుగు)ను కూడా పెవిలియన్ చేర్చాడు. బిల్లంగ్స్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అంబటిరాయుడు, రవీంద్ర జడేజా కలిసి నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో స్పల్ప స్కోరుకే పరిమితమైంది చెన్నై. అంబటి రాయుడు 21 బంతుల్లో 25 పరుగులు చేయగా... 20 బంతులు ఆడిన రవీంద్ర జడేజా కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.



చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైనప్పటికీ సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. దీనికి కారణం ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ప్రతీసారి హైదరాబాద్ జట్టు ఓటమి పాలు కావడమే.. రషీద్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కగా, విజయ్ శంకర్, ఖలీల్ అహ్మద్, నదీమ్‌లకు చెరో వికెట్ దక్కాయి. అయితే ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్‌కు ఛేజింగ్‌లో మంచి రికార్డు ఉండడం హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఊరట నిచ్చే విషయం.
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...