సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ చెలరేగి ఆడింది. అన్ని విభాగాల్లోనూ రాణించి... తిరుగులేని విజయాన్ని అందుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 160 రన్స్ మాత్రమే చెయ్యగలిగింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్ మెన్స్ కలసికట్టుగా ఆడారు. ఓపెనర్లు అజింక్య రహానే 34 బంతుల్లో 39 పరుగులు, లివింగ్ స్టోన్ 26 బంతుల్లో 44 పరుగులు, కెప్టెన్ స్మిత్ 16 బంతుల్లో 22 పరుగులు చేశారు. సంజు శాంసన్ 32 బంతుల్లో 48 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి రాజస్థాన్‌కి అపూర్వ విజయాన్ని అందించాడు. ప్లేఆఫ్ కోసం గట్టి పోటీ పడుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ మంచి విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో షకిబల్ హసన్ , రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు తలో వికెట్ తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలో డేవిడ్ వార్నర్, మనీశ్ పాండ్ దాటిగా ఆడటంతో భారీ స్కోరు వైపు ఇన్నింగ్స్ సాగింది. ఐతే వాళ్లు ఔటయ్యాక పరిస్థితి మారింది. మిగతా బ్యాట్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆరంభంలో 10 రన్‌రేట్ చూపించిన సన్ రైజర్స్ చివరకు 160 పరుగులే చెయ్యగలిగింది. డేవిడ్ వార్నర్ 37, మనీశ్ పాండే 61, విలియమ్సన్ 13, రషీద్ ఖాన్ 17 మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్కోర్ చేశారు. రాయల్స్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, థామస్, గోపాల్, ఉనత్కద్ తలో రెండు వికెట్లు తీశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.