భారత క్రికెట్ మాజీ సారథి, ‘తలైవా’ మహేంద్ర సింగ్ ధోనీ గారాల కూతురు జీవా ధోనీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్తో ముద్దు ముద్దు మాటలతో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది జీవా ధోనీ. కింగ్స్ ఎలెవన్ సహా-యజమాని, హీరోయిన్ ప్రీతి జింటా కూడా జీవా ధోనీని ఎప్పుడో కిడ్నాప్ చేస్తానంటూ మాహీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిందంటే జీవాకి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. తాజాగా జీవా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తమిళ్ నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది జీవా ధోనీ. ఇంతకుముందు ఆసీస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పెయిన్‌ను స్లెగ్జింగ్ చేసిన రిషబ్ పంత్... ఆ తర్వాత అతని భార్యతో ‘బెస్ట్ బేబీ సిట్టర్’గా కాంప్లిమెంట్ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ గారాల కుట్టీతో కూడా సందడి చేస్తూ పిల్లలతో ఎంత కూల్‌గా వ్యవహారిస్తాడో నిరూపించుకున్నాడు రిషబ్ పంత్.
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీని చిత్తు చేసిన ధోనీ టీమ్... 8వ సారి ఫైనల్ చేరి రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 2012 తర్వాత మొదటిసారి ఫ్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సారి ఫైనల్ చేరాలనే కలను నెరవేర్చుకోలేకపోయింది. అయితే మూడో స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది.
Published by:Ramu Chinthakindhi
First published:May 11, 2019, 20:23 IST