IPL 2019, RCB vs KKR: రసెల్ మెరుపు ఇన్నింగ్స్...బెంగుళూరుపై కోల్‌కత్తా విజయం

IPL 2019, RCB vs KKR : KOLKATA WIN BY 5 WICKETS | బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై ఐదు వికెట్ల తేడాతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

news18-telugu
Updated: April 6, 2019, 12:27 AM IST
IPL 2019, RCB vs KKR: రసెల్ మెరుపు ఇన్నింగ్స్...బెంగుళూరుపై కోల్‌కత్తా విజయం
మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతాను గెలిపించిన రసెల్
  • Share this:
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా  ఐదో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు పరాజయం చెందింది. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది. 206 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్..19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని ఛేదించింది. ఆండ్రూ రసెల్ 48(13 బంతుల్లో 7x6, 1x4) మెరుపు ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయం ఒడ్డుకు చేర్చాడు. బెంగుళూరు విజయం ఖాయమనుకున్న సమయంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ గతినే పూర్తిగా మార్చేశాడు రసెల్.   19వ ఓవర్‌లో రసెల్ 4 సిక్సర్లు, ఒక బౌండరీ బాది...జట్టును గెలిపించాడు. అంతకు ముందు ఓపనర్లు క్రిస్ లిన్(43), ఊతప్ప(33), నితీష్ రాణా(37), దినేష్ కార్తిక్(19) కూడా రాణించారు. కోల్‌కతా బ్యాట్స్‌మన్లు సమిష్టిగా రాణించడంతో కొండంత స్కోరు కూడా  కరిగిపోయింది.





అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 3 వికెట్ల నష్టానికి  205 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ(84, 49 బంతుల్లో 9x4, 2x6), డివిలియర్స్‌ (63, 32 బంతుల్లో 5x4, 4x6) అర్ధ శతకాలతో చెలరేగిపోయారు. వారిద్దరూ రెండో వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 17వ ఓవర్లో స్కోర్‌ 172 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడు. అనంతరం 19వ ఓవర్లో 185 పరుగుల వద్ద డివిలియర్స్‌ కూడా ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ (28, 13 బంతుల్లో 3x4, 1x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో బెంగుళూరు 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.





Published by: Janardhan V
First published: April 6, 2019, 12:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading