RCB vs CSK: ఒక్క పరుగు తేడాతో గెలిచిన బెంగళూరు... ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి...

RCB vs CSK in Bangalore: ఒక్క పరుగు, ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన బెంగళూరు జట్టు... 84 పరుగులు చేసి ధోనీ వీరోచిత పోరాటం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 22, 2019, 7:00 AM IST
RCB vs CSK: ఒక్క పరుగు తేడాతో గెలిచిన బెంగళూరు... ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి...
RCB vs CSK in Bangalore: ఒక్క పరుగు, ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన బెంగళూరు జట్టు... 84 పరుగులు చేసి ధోనీ వీరోచిత పోరాటం...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 22, 2019, 7:00 AM IST
IPL 2019 Live Score, RCB vs CSK in Bangalore: ఒక్క పరుగు, ఒకే ఒక్క పరుగు... బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గెలుపుకి, ఓటమికి మధ్య వారథిగా మారింది. చివరి బంతి వరకూ సాగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో గెలిచిన కోహ్లీ సేన... ఫ్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 162 పరుగుల లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లు మొత్తం ఆడి 160 పరుగుల వద్ద ఆగిపోయింది. 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్యంగా పోరాడిన ధోనీ టీమ్... ఓడినా, ప్రేక్షకులకు కావల్సినంత మజాను అందించింది. షేన్ వాట్సన్ 5 పరుగులు, సురేశ్ రైనా డకౌట్, డుప్లిసిస్ 5, జాదవ్ 9 పరుగులకు వెంటవెంటనే అవుట్ కావడంతో 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది చెన్నై జట్టు. ఆ తర్వాత అంబటి రాయుడు 29 పరుగులు, రవీంద్ర జడేజా 11 పరుగులు, బ్రావో 5 పరుగులు ఇలా... అందరితో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ మ్యాచ్ కడవరకూ పోరాడాడు చెన్నై సారథి ధోనీ. 48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేసిన ధోనీ... 1 బంతికి 2 పరుగులు చేస్తే విజయం వరించే స్థితికి తీసుకొచ్చాడు. అయితే ఆఖరి బంతికి శార్దూల్ ఠాగూర్‌ను రనౌట్ చేసిన పార్థివ్ పటేల్... చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ (9 పరుగులు)ని అవుట్ చేసిన దీపక్ చాహార్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఏబీ డివిల్లియర్స్‌తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు పార్థివ్ పటేల్. 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 25 పరుగులు చేసిన డివిల్లియర్స్... జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర డుప్లిసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది బెంగళూరు. ఆ తర్వాత 20 బంతుల్లో 24 పరుగులు చేసిన అక్ష్‌దీప్ సింగ్ కూడా జడేజా బౌలింగ్‌‌‌లో అవుటై పెవిలియన్ చేరాడు. అయితే ఓ వైపు వికెట్లు పుడతున్నా జోరు కొనసాగించిన పార్థివ్ పటేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో అర్ధ శతకం నమోదుచేశాడు పార్థివ్ పటేల్. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాతి బంతికే భారీ షాట్ ప్రయత్నించి, అవుట్ అయ్యాడు పార్థివ్ పటేల్.

ఆ తర్వాత భారీ షాట్ ఆడిన స్టోయినిస్‌ను సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ డుప్లిసిస్ అద్భుత క్యాచ్‌తో అవుట్ చేశాడు. సిక్స్ వెళ్లాల్సిన బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్న డుప్లిసిస్, బంతిని వెంటనే అక్కడే ఉన్న షోర్నేకు పాస్ చేశాడు. ఆ తర్వాత పవన్ నేగీ 5 పరుగులు చేసి, చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివర్లో 5 ఫోర్లతో 26 పరుగులు సాధించిన మొయిన్ ఆలీ కూడా బ్రావో బౌలింగ్‌లోనే అవుటై పెవిలియన్ చేరాడు. దీపక్ చాహార్, జడేజా, బ్రావోలకు రెండేసి వికెట్లు దక్కగా, ఇమ్రాన్ తాహీర్‌లకు ఓ వికెట్ దక్కాయి.



First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...