KXIP vs KKR: శుబ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్... భారీ లక్ష్యాన్ని తేలిగ్గా చేధించిన కోల్‌కతా...

ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం... 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... ఈ విజయంతో ఫ్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకుంది కోల్‌కతా... పంజాబ్ ఫ్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. చివరి మ్యాచ్ గెలిచినా భారీ తేడాతో విజయం సాధిస్తేనే పంజాబ్‌కు ఫ్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. అయితే మిగిలిన జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 4, 2019, 10:33 AM IST
KXIP vs KKR: శుబ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్... భారీ లక్ష్యాన్ని తేలిగ్గా చేధించిన కోల్‌కతా...
శుబ్‌మన్ గిల్‌కు కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆత్మీయ ఆలింగనం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 4, 2019, 10:33 AM IST
IPL 2019, KXIP vs KKR Match in Mohali: 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. క్రిస్‌లీన్, శుబ్‌మన్ గిల్, రాబిన్ ఊతప్ప, ఆండ్రే రస్సెల్, దినేశ్ కార్తీక్.. ఇలా కోల్‌కతా బ్యాట్స్‌మెన్ అందరూ రాణించడంతో 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది కోల్‌కతా. ఓపెనర్లు క్రిస్‌లీన్, శుబ్‌మన్ గిల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది కోల్‌కతా. క్రిస్‌లీన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప 22 పరుగులు, ఆండ్రే రస్సెల్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కెప్టెన్ దినేశ్ కార్తీక్‌తో కలిసి విజయాన్ని పూర్తిచేశాడు యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్. శుబ్‌మన్ గిల్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేయగా... కెప్టెన్ దినేశ్ కార్తీక్ 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై, అశ్విన్, షమీలకు తలా ఓ వికెట్ దక్కాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగుల భారీ స్కోరు చేసింది. కొత్త కుర్రాడు సందీప్ వారియర్ ఓపెనర్లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చి, పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. లోకేశ్ రాహుల్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా...క్రిస్‌గేల్ 14 పరుగులు చేసి సందీప్ వారియర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో నికోలస్‌ పూరన్, మయాంక్ అగర్వాల్ కలిసి మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసిన నికోలస్ పూరన్... నితీశ్ రాణా బౌలింగ్‌లో సందీప్ వారియర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాాత కొద్దిసేపటికే 36 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా అవుట్ కావడంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మన్‌దీప్ సింగ్ 25 పరుగులు చేసి గుర్నే బౌలింగ్‌లో ఊతప్పకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన, రస్సెల్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత సామ్ కుర్రాన్ చెలరేగిపోయాడు.

24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సామ్ కుర్రాన్. గుర్నే వేసిన చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన సామ్ కుర్రాన్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. సందీప్ వారియర్‌కు రెండు వికెట్లు దక్కగా, నితీశ్ రాణా, గుర్నే, రస్సెల్‌కు తలా ఓ వికెట్ దక్కాయి.

First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...