ఒక్క వికెట్ ఖరీదు రూ. 8.4 కోట్లు... గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన యంగ్ క్రికెటర్...

ఒకే ఒక్క మ్యాచ్ ఆడి నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి, ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసిన వరుణ్ చక్రవర్తి... గాయం కారణంగా సీజన్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 3, 2019, 8:35 PM IST
ఒక్క వికెట్ ఖరీదు రూ. 8.4 కోట్లు... గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన యంగ్ క్రికెటర్...
ఒకే ఒక్క మ్యాచ్ ఆడి నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి, ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసిన వరుణ్ చక్రవర్తి... గాయం కారణంగా సీజన్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం...
  • Share this:
ఐపీఎల్ 12వ సీజన్‌ ఆరంభానికి ముందు సంచలనం క్రియేట్ చేసిన పేరు ‘వరుణ్ చక్రవర్తి’. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చిన ఈ యంగ్ స్టార్‌ను ఏకంగా రూ. 8.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. మంచి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తి... ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన ఇస్తాడని భావించింది కింగ్స్ ఎలెవన్ టీమ్ యాజమాన్యం. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అద్భుత బౌలింగ్‌తో మోస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి... పంజాబ్ జట్టుకు ఎంతగానే ఉపయోగపడతారని ఫ్యాన్స్ భావించారు. అయితే సీజన్ ప్రారంభం తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన వరుణ్ చక్రవర్తి... ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి, ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ప్రతీ మ్యాచ్‌కు జట్టులో మార్పులు చేసే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్... మోస్ట్ కాస్ట్‌లీ ప్లేయర్‌కి మరో ఛాన్స్ ఇవ్వలేదు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం వేలంలో కొన్న తర్వాత ఆటగాడిని ఆడించినా... రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసినా అతనికి చెల్లించాల్సిన సొమ్ములో ఎలాంటి మార్పు ఉండదు. తాజాగా ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన వరుణ్ చక్రవర్తి పూర్తి సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 5 విజయాలు సాధించింది. రన్‌రేట్ కూడా పెద్దగా లేకపోవడంతో మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక విజయం సాధిస్తేనే ఫ్లేఆఫ్‌కు చేరుతుంది. లేదంటే రెండు మ్యాచ్‌ల తర్వాత పంజాబ్ కథ ముగిసినట్టే. అదీగాక పంజాబ్ జట్టు సహ-యజమాని నెస్ వాడియా డ్రగ్స్‌తో జపాన్‌లో దొరికిపోయాడు. కో-ఓనర్ అరెస్ట్ కావడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం జట్టుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఎవ్వరైనా తప్పుచేస్తే... ఆ జట్టుపై నిషేధం పడుతుంది. నెస్ వాడియా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో కింగ్స్ ఎలెవన్ జట్టుపై నిషేధం పడే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఇలాగే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.First published: May 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>