IPL 2019: MI vs CSK: జాధవ్ ఒంటరి పోరాటం వృధా...చెన్నైపై ముంబై ఇండియన్స్ విజయం

IPL 2019: MI vs CSK: ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.

news18-telugu
Updated: April 4, 2019, 12:18 AM IST
IPL 2019: MI vs CSK: జాధవ్ ఒంటరి పోరాటం వృధా...చెన్నైపై ముంబై ఇండియన్స్ విజయం
కేధార్ జాదవ్ పోరాటం వృధా
  • Share this:
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కేదార్ జాధవ్ పోరాటం వృధా అయ్యింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓటమిని నమోదు చేసుకుంది.  అర్ధశతకంతో జాధవ్(58) పోరాడినా మిగిలిన అందరూ చేతులెత్తేయడంతో ముంబై వాంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాదవ్(58) ఒంటరి పోరాటం చేయగా... సురేష్ రైనా(16), ధోనీ(12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన ఆటగాళ్లు అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఓపనర్ అంబటి రాయుడు(0) మరోసారి నిరాశపరిచాడు. మలింగా, హార్ధిక్ పాండ్యా తలా మూడేసి వికెట్లు పడగొట్టారు.



అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. సూర్య కుమార్ యాదవ్(59) అర్ధ శతకంతో అదరగొట్టగా...కృణాల్ పాండ్యా(42), హార్ధిక్ పాండ్యా(8 బంతుల్లో 25 పరుగులు-నాటౌట్)  రాణించారు. పొలార్డ్(7 బంతుల్లో 17 పరుగులు-నాటౌట్)తో కలిసి హార్ధిక్ పాండ్యా చివరి 13 బంతుల్లో 45 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇటు బ్యాటింగ్...అటు బౌలింగ్‌లోనూ రాణించిన హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Published by: Janardhan V
First published: April 4, 2019, 12:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading