ప్యాంటు తడిచేలా రక్తం కారుతున్నా... బ్యాటింగ్ వదలని వాట్సన్

ఫైనల్‌ వరకు వచ్చిన సీఎస్కే టీం ఓడినా... చివరి వరకు గెలుపు కోసం పోరాడిన వీరుడిగా వాట్సన్ మాత్రం సోషల్ మీడియా ఇప్పుడు వాట్సన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది.

news18-telugu
Updated: May 14, 2019, 10:33 AM IST
ప్యాంటు తడిచేలా రక్తం కారుతున్నా... బ్యాటింగ్ వదలని వాట్సన్
1. షేన్ వాట్సన్: ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగోచ్చు. గత సీజన్లో, వాట్సన్ కేవలం 23.41 సగటుతో 398 పరుగులు మాత్రం చేశాడు. 2018లో చెన్నై ఐపీఎల్ ఛాంపియన్‌గా కీలక పాత్ర పోషించాడు. 154.59 స్ట్రైక్ రేట్‌లో ఐపీఎల్ 11 లో వాట్సన్ 555 పరుగులు చేశాడు.
  • Share this:
షేన్ వాట్సన్... క్రికెట్ అభిమానులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మే12న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో వాట్సాన్ ఆడిన తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన షేన్ వాట్సాన్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్. అంతేకాదు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఐపీఎల్‌ 2019లో అతడు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఆడాడు. ఫైనల్‌ వరకు వచ్చిన సీఎస్కే టీం ఓడినా... చివరి వరకు గెలుపు కోసం పోరాడిన వీరుడిగా వాట్సన్ మాత్రం సోషల్ మీడియా ఇప్పుడు వాట్సన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఈ మ్యాచ్‌లో వాట్సన్ దాదాపు విజయం వరకు చేరాడు. చివరి నిమిషంలో ఆఖరి మెట్టుపై బోల్తాపడ్డాడు. అయితే వాట్సాన్ అవుట్ అవ్వడానికి ముందు గ్రౌండ్‌లో పడిపోయాడు. దీంతో అతని ఎడమ కాలికి తీవ్ర గాయం అయ్యింది. అయినా అదేం పట్టించుకోలేదు సరికదా... రక్తం కారుతున్నా.. కూడా పరుగులు తీశాడు.

వాట్సన్‌కు ఎంత గాయం జరిగిందంటే... అతని ప్యాంట్‌ తడిచి రక్తం బయటకు కనిపించింది. ఎడమ మోకాలికి గాయమై, రక్తం కారిపోతున్నా...చెన్నైని గెలిపించాలన్న తపనతో వాట్సన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే భరించలేని బాధతో వికెట్ల మధ్య పరిగెత్తలేక అవుట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు వాట్పాప్ గాయానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్కే జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని షేర్ చేశాడు. దీన్ని చూసిన వారంతా 'వాట్సన్ గ్రేట్' అని కితాబిస్తున్నారు. అతని అభిమానులంతా నువ్వే గ్రేట్ వాట్సాన్ అంటూ ...అతడి కాలు నుంచి రక్తం కారుతున్న ఫోటోలు పోస్టు చేసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు వాట్సన్‌కు గేమ్ తర్వాత గాయానికి ఆరుకుట్లు కూడా పడ్డాయని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కొందరైతే ... నీలా అంకితభావంతో ఆటలాడే ఆటగాడు చాలా అరుదంటూ కితాబిస్తున్నారు. మొత్తం మీద వాట్సాన్ ఐపీఎల్ ఫైనల్‌లో ఓడినా.. అభిమానుల మనసుల్ని మాత్రం గెలుచుకున్నాడనేది ఎవరూ కాదనలేని నిజం.


Published by: Sulthana Begum Shaik
First published: May 14, 2019, 10:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading