SRH vs KKR: వార్నర్, బెయిర్ స్టో సూపర్ షో... కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘనవిజయం...

SRH vs KKR: మొదటి వికెట్‌కు మరోసారి సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసిన బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్... 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 7:24 PM IST
SRH vs KKR: వార్నర్, బెయిర్ స్టో సూపర్ షో... కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘనవిజయం...
అదే సమయంలో అక్టోబర్‌ నవంబర్‌ సమయాన్ని ఐపీఎల్‌ కోసం కేటాయించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం సిద్ధమవ్వాలని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సమాచారం ఇచ్చారు. కానీ సిరీస్‌ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
  • Share this:
IPL 2019 Live Score, SRH vs KKR Match in Hyderabad: 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో ఎప్పటిలాగే ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. 8.4 ఓవర్లలో ఈ ఇద్దరూ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోల మధ్య ఇది నాలుగో సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. మొదటి మూడు మ్యాచుల్లో వరుస సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత 5 మ్యాచుల తర్వాత మళ్లీ ఈ జోడి శతాధిక భాగస్వామ్యం నమోదుచేసింది. డేవిడ్ వార్నర్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, బెయిర్ స్టో కూడా సరిగ్గా 28 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఈ జోడి దూకుడు కారణంగా స్కోరు బోర్డు దూసుకుపోయింది. నరైన్ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్‌ను కోల్‌కతా ఫీల్డర్లు జారవిరిచాడు. ఆ తర్వాత బౌండరీలతో దూకుడు చూపిన డేవిడ్ వార్నర్... ఎర్రా పృథ్వీరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్. మొదటి వికెట్‌కు ఈ ఇద్దరూ 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ చాలా తక్కువగా ఉండడంతో కేన్ విలియంసన్‌తో కలిసి నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు బెయిర్ స్టో. సింగిల్స్ తీసేందుకే ప్రాధాన్యం ఇస్తూ అప్పుడప్పుడూ బౌండరీలు సాధించారు. విజయానికి 11 పరుగులు కావల్సిన సమయంలో ఓ ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి, మ్యాచ్ ఫినిష్ చేశాడు. 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసిన బెయిర్ స్టో, 8 పరుగులతో కేన్ విలియంసన్ నాటౌట్‌గా నిలిచారు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదుచేసింది. ఆరంభంలో సునీల్ నరైన్, క్రిస్‌లీన్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 2.3 ఓవర్లలోనే 42 పరుగుల సాధించిన కోల్‌కతాకు ఖలీల్ అహ్మద్ గట్టి సాక్ ఇచ్చాడు. 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన సునీల్ నరైన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఖలీల్ అహ్మద్... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 11 పరుగులు చేసిన నితీశ్ రాణాను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయగా... దినేశ్ కార్తీక్ (6 పరుగులు) రనౌట్ అయ్యాడు. 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఆ తర్వాత యంగ్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌తో కలిసి జోరు కొనసాగించాడు క్రిస్‌లీన్. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ కలిసి 51 పరుగులు జోడించారు. ఈ దశలో 25 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రింకూ సింగ్, సందీప్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

46 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో క్రిస్‌లీన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో అతనికి ఇది తొమ్మిదో హాఫ్ సెంచరీ. ఆ తర్వాతి బంతికే భారీ షాట్ ఆడిన క్రిస్ లీన్‌ను, అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు కేన్ విలియంసన్. ఆ తర్వాత భువనేశ్వర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన రస్సెల్ (15 పరుగులు)... అదే ఓవర్లో రషీద్ ఖాన్‌ను క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్ వేసిన రషీద్ ఖాన్, పియూష్ చావ్లా (4 పరుగులు)ను అవుట్ చేశాడు. అయితే కరియప్ప ఆఖర్లో ఓ సిక్స్‌ కొట్టడంతో కోల్‌కతా జట్టు 159 పరుగుల వద్ద ఆగింది. ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్‌కు రెండు, రషీద్ ఖాన్, సందీప్ శర్మకు చెరో వికెట్ దక్కాయి.
Published by: Ramu Chinthakindhi
First published: April 21, 2019, 7:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading