SRH vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్... కోల్‌కతా బ్యాటింగ్...

కుల్దీప్ యాదవ్‌ను తప్పించిన దినేశ్ కార్తీక్... అతని స్తానంలో ఎర్రా పృథ్వీరాజ్‌కు అవకాశం... ఓపెనర్లపైనే ఆధారపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 3:52 PM IST
SRH vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్... కోల్‌కతా బ్యాటింగ్...
కుల్దీప్ యాదవ్‌ను తప్పించిన దినేశ్ కార్తీక్... అతని స్తానంలో ఎర్రా పృథ్వీరాజ్‌కు అవకాశం... ఓపెనర్లపైనే ఆధారపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
  • Share this:
IPL 2019 Live Score, SRH vs KKR Match in Hyderabad: కోల్‌కత్తాకి, హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా జట్టు బ్యాటింగ్ చేయనుంది. కోల్‌కతా జట్టులో మూడు మార్పులు జరిగాయి. కుల్దీప్ యాదవ్‌ను తప్పించిన దినేశ్ కార్తీక్ అతని స్తానంలో ఎర్రా పృథ్వీరాజ్‌కు అవకాశం కల్పించాడు. అలాగే కేసీ కరియప్ప, రింకూ సింగ్ కోల్‌కతా తుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో ఈ రెండు తలబడిన మ్యాచ్‌లో కోల్‌కతా ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ దాకా సాగిన ఈ మ్యాచ్‌... అభిమానులకు అసలు సిసలైన ఐపీఎల్ మజాను అందించింది. అయితే మిడిల్ ఆర్డర్ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును తెగ ఇబ్బంది పెడుతోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ కనీస పరుగులు సాధించలేకపోతున్నారు. కేన్ విలియంసన్‌తో సహా యూసఫ్ పఠాన్, విజయ్ శంకర్ కూడా ఘోరంగా విఫలమవుతుండడం హైదరాబాద్ జట్టును కలవరబెడుతోంది. మరోవైపు కోల్‌కతా బలం ఆ మిడిల్ ఆర్డరే. ఓపెనర్లు విఫలమైనా మిడిల్ ఆర్డర్‌లో నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్, ఆండ్రే రస్సెల్ కలిసి విజయాన్ని అందిస్తున్నారు.

హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, జాన్నీ బెయిర్‌స్టో, కేన్ విలియంసన్, దీపక్ హుడా, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నదీమ్, ఖలీల్ అహ్మద్

కోల్‌కత్తా జట్టు: క్రిస్ లీన్, సునీల్ నరైన్, రాబిన్ ఊతప్ప, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, ఆండ్రూ రసూల్, పియూష్ చావ్లా, రింకూ సింగ్, కేసీ కరియప్ప, హ్యారీ గుర్నే, ఎర్రా పృథ్వీరాజ్
Published by: Ramu Chinthakindhi
First published: April 21, 2019, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading